శ్రీరామనవమికి ఆలయాలు సిద్ధం
జిన్నారం మండల వ్యాప్తంగా బుధవారం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిన్నారం, మంగంపేట, మాదారం గ్రామాల్లోని రామాలయాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించే ఖాజీపల్లి, గడ్డపోతారం, వావిలాల, ఊట్ల, శివనగర్, అండూరు, సోలక్పల్లి, దాదిగూడెం తదితర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- సీతారాముల కల్యాణానికి ముస్తాబైన ఆలయాలు
జిన్నారం, ఏప్రిల్ 16 : జిన్నారం మండల వ్యాప్తంగా బుధవారం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిన్నారం, మంగంపేట, మాదారం గ్రామాల్లోని రామాలయాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించే ఖాజీపల్లి, గడ్డపోతారం, వావిలాల, ఊట్ల, శివనగర్, అండూరు, సోలక్పల్లి, దాదిగూడెం తదితర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీరామా నవమి సందర్భంగా రామాలయాలు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.
కోహీర్‌లో..
కోహీర్, ఏప్రిల్16 : కోహీర్ పట్టణంలోని రామ మందిరంతో పాటు దిగ్వాల్ గ్రామంలోని సీతారామాంజనేయ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు మంగళవారం ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం సీతారాముడి కల్యాణం ఉంటుందని, అనంతరం భక్తులకు అన్నదానం చేస్తామని కల్యాణ్‌కృష్ణ రాందాస్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి..
బొల్లారం, ఏప్రిల్ 16: మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను పురసరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నదాన కార్యక్రమం లో భక్తులు పాల్గొనాలని కోరారు.
గుమ్మడిదలలో ..
గుమ్మడిదల, ఏప్రిల్ 16 : శ్రీరామ నవమిని పర్వదినం పురష్కరించుకొని మండల కేంద్రంలో శ్రీకల్యాణ రామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఆలయ వంశపార్య పర్యంకులు కేవీ. రామానుజాచార్యులు, కేవీ. నర్సింహాచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షుడు పడమటి లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అర్చక బృందం కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నారు. 17 నుంచి 20 తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

