చింతచిగురు ఆరోగ్యానికి మేలు
ప్రకృతి మనిషికి అందించిన వరప్రదాయినీ చింతచెట్టు... చింతచెట్టుకు కాసే చింతకాయతోపాటు చిగురుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. చింతచిగురుతో వంట చేసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు
సీ విటమిన్ లభ్యం
రోగనిరోధక శక్తికి దోహదం
రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ
మే నెలలో చింతచెట్టుకు పూత
హుస్నాబాద్ టౌన్, మే 22 : ప్రకృతి మనిషికి అందించిన వరప్రదాయినీ చింతచెట్టు… చింతచెట్టుకు కాసే చింతకాయతోపాటు చిగురుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. చింతచిగురుతో వంట చేసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. మే మాసంనుంచి లభించే చింతచిగురును ఇష్టంతో తినేందుకు పోటీపడుతున్నారు. రహదారుల పక్కన ఉండే ఈ చింతచెట్ల వద్ద ఇటీవల నిత్యం జన సందండి కనిపిస్తున్నది.
రోగనిరోధక శక్తిని పెంచుతుందనే నమ్మకం
చూస్తే చిన్నదైనా.. అది చేసే మేలు మాత్రం పెద్దదని ప్రకృతి వైద్యనిపుణలు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషిచేస్తుంది. దీంతో చింతచిగురును తినేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. చింతచిగురు ప్రేమికులు చింతచెట్ల వద్ద చిగురును కోసే పనిలో పడుతున్నారు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుచడంతోపాటు చెడుకొవ్వును తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేయడం, కీళ్లనొప్పులను సైతం తగ్గించి ఎముకలను బలంగా మారుస్తుంది. శరీరంలో నులి పురుగులను సైతం తొలిగిస్తున్నదని ప్రకృతి వైద్యనిపుణులు వివరిస్తున్నారు.
పప్పు.. చేపలు.. చికెన్, మటన్‌లో సైతం..
చింతచిగురును పలు రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా వంటకంగా తయారు చేసుకోవడంతోపాటు చట్నీ పెట్టుకోవచ్చు. వివిధ రకాల పప్పులతో పాటు చేపలు, చికెన్, మటన్‌లో సైతం చింతచిగురు వేస్తారు. ముఖ్యంగా ఉల్లిగడ్డతో కలిపి చింతచిగురును వంటచేసుకుంటే ఆ కమ్మదనం మరిచిపోలేమని చిగురుప్రియులు లొట్టలు వేసుకుని మరీచెబుతున్నారు. సీ విటమిన్ టాబ్లెట్‌ను తీసుకునే బదులుగా చింత చిగురును తరుచుగా వంటల్లో చేర్చి తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని పలువురు నమ్మకం. ప్రకృతి అందిస్తున్న చింత చిగురు ఆయా ప్రాంతాల్లో మంచి ధరసైతం పలుకుతుండడం విశేషం.
రెండు, మూడు రోజులకోసారి వంట చేసుకుంటున్నం
మా ఇంట్లో రెండుమూడు రోజులకోసారి చింతచిగురుతో వంట చేసుకుంటున్నాం. ఇప్పుడే ఎక్కువ ఇగురు వస్తున్నది. తప్పనిసరిగా మా ఇంట్ల అందరం తింటాం. చేపల కూరలో ప్రత్యేకంగా చింత చిగురుతోని వండుకుని తింటాం. మంచి రుచి ఉంటది. మోకాళ్ల నొప్పులు కూడా రావని, దీన్ని ఎక్కువ తింటున్నాం. – పూదరి శ్రీనివాస్, హుస్నాబాద్
ఉల్లిగడ్డలతో వంట చేసుకుంటే కమ్మగ ఉంటది
ఉల్లిగడ్డలతోని చింతచిగురు వంట చేసుకుంటే కమ్మగ ఉం టంది. చిన్నప్పుటి నుంచి చింతచిగురు తింటున్న. నోరుకు సైతం సై ఉంటదని చిగురును తెంపుకుంటున్న. ఎవ్వలైనా చింతచిగురుతోని కూరలు వండుకొని తింటే శరీరం మంచిగ ఉంటది.
– గొల్లపల్లి వెంకటాద్రి, గుడాటిపల్లి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

