ప్రారంభోత్సవాల హడావుడి తప్ప గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు గడ్డం నాగరాజు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తోందని గడ్డం నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు.
దౌల్తాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తోందని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గడ్డం నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప రైతులకు, గ్రామాలకు జరుగుతున్న మేలు ఏమిటని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.
సెలవు రోజున అధికారులను మభ్యపెట్టి, పోలీసుల సహకారంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రభుత్వంలో అధికారిక హోదా, ప్రోటోకాల్ లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫొటోలు దిగితే రైతుల సమస్యలు పరిష్కారమైనట్లా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లను ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు అప్రమత్తం చేయలేదని నిలదీశారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం, మిల్లులకు తరలించడం, రైతులకు చెల్లింపులు చేయడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రచారానికి పరిమితం కావడం సరికాదన్నారు.
సర్పంచులు, ఉపసర్పంచులు బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం కావస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెంటాడుతోందని అన్నారు. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేసిందో లెక్కలు చెప్పాలని, గ్రామాల వారీగా నిధుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితుల్లో నాయకులు ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలతో కాలం వెళ్లదీయడం మానుకోవాలని, రాజకీయ హడావుడి పక్కనపెట్టి రైతుల సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

