Chalukyas |పాత దొమ్మాటలో చాళుక్యుల ఆనవాళ్లు
చాళుక్యుల ఆనవాళ్లు | మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ పాత దొమ్మాట గ్రామంలో బుధవారం పర్యటించి పలు చారిత్రక అనవాళ్లను విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు.

చేర్యాల, అక్టోబర్ 20 : మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ పాత దొమ్మాట గ్రామంలో బుధవారం పర్యటించి పలు చారిత్రక అనవాళ్లను విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు.
దొమ్మాట గ్రామం మొదటగా మోయతుమ్మెద వాగు, కృష్ణ చెరువుకు మధ్య భాగంలో ఉండేదని, వాగు, చెరువు ఏక కాలంలో ఉప్పొంగడంతో గ్రామం జలదిగ్భందం అయిందన్నారు. వాగు ఒడ్డునగల పాత ఊరిలో గద్దె పై హనుమాన్ విగ్రహం ఉందని, హానుమాన్ విగ్రహం ముందు పానపట్టం మీద శిరస్సు, వెనక లింగం ఉన్నట్లు తెలిపారు.
బహుశ ఆత్మార్పణ సందర్భంగా శిరస్సును అర్పించింది కావొచ్చన్నారు. దాని కింద గజ్జెల పట్టెడతో అలంకరించిన శిథిలమైన నంది చాళుక్యుల కాలంనాటిది, కొంచెం ముందుకు ఒక శిథిల వైష్ణవాలయం ఉందని, దేవాలయానికి ఇరువైపులా వైష్ణవ ద్వారపాలకులున్నట్లు వివరించారు.
ద్వారశాఖకు లలాటబింబంగా శంఖు, చక్రాల మధ్య తిరునామాలు చెక్కబడి ఉన్నాయని, గుడి పక్కన మట్టిగోడలతో పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు చెప్పారు. అక్కడే కుమ్మరి ఆవం, ఇనుము చిట్టెం తమకు లభించినట్లు తెలిపారు.
రామాలయం నుంచి తీసుకువెళ్లిన కొన్ని విగ్రహాలు హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించారు. వాటిలో అల్వార్ల విగ్రహాలు, విష్ణుమూర్తి శంఖు, చక్రాలతో కుడి చేయి వరదహస్తం, ఎడమచేయి అభయహస్తంతో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

