పెద్దశంకరంపేటలో లాక్ డౌన్

వర్తక, వాణిజ్య దుకాణాల మూసివేత
వెలవెలబోయిన 161వ జాతీయ రహదారి
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 24 : పట్టణంలో శనివారం నుంచి లాక్డౌన్ విధించారు. మండలం లో సుమారు 200కు పైగా కరోనా పాజిటివ్ కేసు లు నమోదు కావడంతోపాటు మండలంలో నలుగురు కరోనాతో చనిపోవడంతో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. సర్పంచ్ అలుగుల సత్యనారాయణతోపాటు ప్రజాప్రతినిధులు పిలుపునివ్వడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. ఉదయం పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా వస్తువులు తదితర సామగ్రిని వినియోగదారులు కొనుగోలు చేశారు. ప్రజలు, వర్తక, వాణి జ్య, దుకాణాల సమూదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. వాహనాలు, ఆటో లు, ప్రైవేట్ వాహనాలు తిరగకపోవడంతో 161వ జాతీయ రహదారి వెలవెలబోయింది. కిరాణం, వర్తక, వాణిజ్య, హోటళ్లు, చిరువ్యాపారులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరవడంతో ప్రజలు వస్తువులు కొనుగోలు చేసుకున్నారు. పట్టణంలో వర్తక, వాణిజ్య దుకాణాలు మూసి వేయడంతోపాటు ప్రజలు ఎవ్వరూ రహదారులపై తిరగకపోవడంతో లాక్డౌన్ విజయవంతమైంది.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- pedda shankarampet
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

