జహీరాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆమె ధైర్యం, తెగువ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు, దొరలకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి ఐలమ్మ అని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ గ్రామ నాయకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షబ్బీర్ ఖాన్, నాయకులు సంగారెడ్డి, నర్సారెడ్డి, సంగారెడ్డి, ఆశప్ప, రవీందర్, మహేష్, రజక సంఘం నాయకులు మల్లికార్జున్, అడివన్న, సంగన్న తదితరులు పాల్గొన్నారు.