గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
- యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50 శాతం మందికి పని చూపించాలి
- నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి
- పంచాయతీశాఖ అధికారులతో సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 28: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులతో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబిలైజేషన్, పనుల గుర్తింపు, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్, గ్రామ పంచాయతీ ట్యాంకర్ల వినియోగం, నర్సరీలు, మొక్కల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రస్తుతం పనుల సీజన్ అయినందున ముందుగా పనులు గుర్తించి, అంచనాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని, వెంటనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. శ్రమ శక్తి సంఘాలకు పనులు ఇవ్వడం, చేసిన పనులకు మెజర్మెంట్ చేయాలన్నారు. అదేవిధంగా పే ఆర్డర్ జనరేట్ చేసి పే స్లిప్స్ ఇవ్వాలన్నారు. పనులు పూర్తయిన చోట వర్క్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ పనులు కావాలో వాటిని గుర్తించాలని సూచించారు. ఎప్పుడూ 20 పనులు షెల్ఫ్‌లో ఉండాలన్నారు. కూలీలకు వేజ్ రేట్ పెరిగేలా పనులు జరగాలని పేర్కొన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాలని, ఆయా అంశాలపై సమీక్షించాలని సూచించారు. లేబర్ మొబిలైజేషన్ బాగా చేసిన అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
లక్ష్యాన్ని సాధించకుంటే చర్యలు తప్పవు
పంచాయతీ అధికారులు లక్ష్యాన్ని సాధించని పక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి గ్రామ పంచాయతీలోని నర్సరీలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సజావుగా ఉండాలన్నారు. మొక్కలను సంరక్షిస్తే మొక్క చెట్టుగా మారి మనలను రక్షిస్తుందని కలెక్టర్ హితవు పలికారు. గ్రామ పంచాయతీల్లోని ట్యాంకర్ల ద్వారా ప్రతి వారం అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కలకు వాటరింగ్ చేయాలని స్పష్టం చేశారు. కనీసం ప్రతి వారం 10 నుంచి 15 ట్యాంకర్లను మొక్కలకు వాటరింగ్ కోసం వినియోగించాలన్నారు. 100 శాతం పన్ను వసూలు కావాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

