‘దళితబంధు’ గ్రేడింగ్ పూర్తి చేయాలి
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో దళితబందు పథకం పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు
లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి
వసతుల ఏర్పాట్లపై దృష్టిపెట్టండి డెయిరీ యూనిట్ల షెడ్లు వెంటనే నిర్మించాలి
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో దళితబందు పథకం పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంఫీడీవోలు యూనిట్ వారిగా ఎప్పటికప్పుడు సమీక్షించి లబ్ధిదారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. డెయిరీ, పౌల్ట్రీ వంటి యూనిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన అన్ని వసతుల ఏర్పాట్లలో జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు హితవు చేశారు. బోర్ వేసిన తరువాత లబ్ధిదారులకు నచ్చిన మోటార్లు తెచ్చుకునే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆయా గ్రామాలకు వెళ్లి యూనిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లతో పాటు యూనిట్‌కు అవసరమైన సౌకర్యాలు పరిశీలించాలన్నారు. గేదెలకు సంబంధించిన యూనిట్లలో షెడ్లు పూర్తి కావాలన్నారు. నిర్ణీత సమయంలోగా పూర్తి చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దళితబంధు అమలులో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

