ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ యాస, భాషకు గుర్తింపు.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

మనోహరాబాద్: ప్రత్యేక రాష్ట్రంలోనే తెలంగాణ యాస, భాషకు గుర్తింపు వచ్చిందని, గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం శభాష్పల్లిలో బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అరవై ఏండ్ల ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ అణిచివేతకు గురైందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఉద్యమంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
మన యాస, మన భాషలకు నేడు ప్రపంచం నలుమూలల గుర్తింపు వచ్చిందన్నారు. బతుకమ్మ పండుగను విదేశాల్లో సైతం గౌరవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల అధ్యక్షుడు రాజరమణాగౌడ్, సర్పంచ్‌లు రంగపల్లి పార్వతిసత్యం ముదిరాజ్, మాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

