మెదక్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ బుధవారం ఉదయం ఐడీవోసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆర్డీవో రమాదేవి, కలెక్టర్ కార్యాలయ ఏవో యూనిఫ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పీఆర్ ఈఈ నర్సింలు, ఏడీ మైన్స్ జయరాజ్, ఇతర శాఖల అధికారులు నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు వివిధ అంశాలపై నూతన కలెక్టర్ అధికారులతో చర్చించారు.