నిధులు మంజూరైనా జరగని నిర్మాణం
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రధాన రహదారి దెబ్బతిన్నడం తో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోహీర్ పట్టణంలోని డీసీసీ బీ బ్యాంకు ఎదురుగా ఉన్న బీటీ రోడ్డు ధ్వం సం కావడంతో అక్కడ సీసీ రోడ్డును నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
- కోహీర్లో సీసీ రోడ్డు నిర్మాణం మరిచిన అధికారులు
- నిత్యం ప్రమాదాల బారిన వాహనదారులు
కోహీర్, జూలై 21 : సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రధాన రహదారి దెబ్బతిన్నడం తో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోహీర్ పట్టణంలోని డీసీసీ బీ బ్యాంకు ఎదురుగా ఉన్న బీటీ రోడ్డు ధ్వం సం కావడంతో అక్కడ సీసీ రోడ్డును నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మురుగు నీటి కాల్వల నిర్మాణానికి రూ.15లక్షలు, సీసీ రోడ్డుకు రూ.8లక్షలను కేటాయించింది. ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంజూరైన నిధులతో రోడ్డుకు ఇరువైపులా కాల్వలను నిర్మించారు.
కానీ, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సీసీ రోడ్డు నిర్మాణం మాత్రం మిగిలిపోయింది. కాల్వలు నిర్మించి ఏడాది కావస్తున్నా సీసీ రోడ్డు నిర్మాణ సంగతిని మాత్రం మరిచిపోయారు. దీంతో కోహీర్-బిలాల్పూర్ ప్రధాన రహదారిపై పెద్దపెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలబడడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనేక మంది అందులో పడి గాయాలపాలయ్యారు. సంబంధిత అధికారు లు స్పందించి సీసీ రోడ్డును నిర్మించాలని, కనీసం జిల్లా అధికారులైనా స్పందించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
ఎంతోమంది గాయపడ్డారు..
కోహీర్లో డీసీసీబీ బ్యాంకు ఎదురుగా సీసీరోడ్డు, మురుగు కాల్వ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.23 లక్షల నిధులు మం జూరు చేసింది. పనులు ప్రారంభించి కాల్వలను కూడా నిర్మించారు. కానీ, సీసీ రోడ్డు ను మాత్రం నిర్మించకుండా వదిలేశారు. ఇప్పటికీ ఈ రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి ఎంతోమందికి దెబ్బలు తగిలాయి. అయినా ఇక్కడి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులైనా స్పందించి, రోడ్డును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.
– గణేశ్రెడ్డి, వాహనదారుడు, కోహీర్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

