మెదక్ మున్సిపాలిటీ/ చిన్నశంకరంపేట/ హవేళిఘనపూర్/ రామాయంపేట/ నిజాంపేట/ శివ్వంపేట, డిసెంబర్ 6 : జిల్లాకేంద్రం మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టి నరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. పట్టణంలో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. పట్టణంలోని రేణుకాంబ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేయిస్తూ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. పిల్లీకోటాల్లోని కేసీఆర్ నగర్ నుంచి ప్రారంభమైన వేడుకలు క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించారు. ఆటోనగర్ ఎక్స్ రోడ్డులో కౌన్సిలర్లు సులోచనాప్రభురెడ్డి, సమీయొద్దీన్, వాసు మోటర్స్ వద్ద బండ నరేందర్, ఏఎంసీ చైర్మన్ జగపతి, పాత బస్టాండ్ వద్ద్ద నాయకులు ఉమర్, ముజీబ్, జుబేర్, మార్కెట్లో కౌన్సిలర్లు శ్రీనివాస్, మానస, రుక్మిణీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. సుఫీ హోటల్ వద్ద కౌన్సిలర్ శంసున్నిషా బేగం, జర్నలిస్ట్టుల ఆధ్వర్యంలో హెడ్‌పోస్టాఫీస్ వద్ద కేక్ కట్ చేశారు. జంబికుంట ప్రభు త్వ పాఠశాలలో, చంద్రభవన్ హోటల్ వద్ద కౌన్సిలర్ వనజ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. ఆమె వెంట జడ్పీటీసీలు కృష్ణారెడ్డి, సౌందర్య, జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్‌గౌడ్ ఉన్నారు.
మెదక్, చిన్నశంకరంపేట, హవేళిఘన్పూర్ మండలాల్లో..
మెదక్ మండలం పేరూరులో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, ఎంపీపీ యమున, నేతలు అంజాగౌడ్, హన్మంత్‌రెడ్డి, కిష్టయ్య పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, నేతలు లక్ష్మారెడ్డి, రాజు, సర్పంచ్‌లు రాజిరెడ్డి, యాదగిరియాదవ్, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్‌లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్, ఎంపీటీసీలు కసిరెడ్డి, మాణిక్యరెడ్డి, వైస్‌ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఖాలేద్, శ్రీహరి, సవిత, యామిరెడ్డి, చెన్నాగౌడ్, సాయిలు, రామచంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, మేకల సాయిలు పాల్గొన్నారు.
వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే తనయుడు పునీత్‌రెడ్డి
రామయాంపేటలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు పునీత్‌రెడ్డి, ఎమ్మెల్యే సోదరి అనిత హాజరై కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో నేతలు యాదగిరి, పుట్టి విజయలక్ష్మి, పుట్టి యాదగిరి, బాదె చంద్రం, మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగరాజు, యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, మాజీ ఎంపీటీసీ హైమద్ పాల్గొన్నారు. కోనాపూర్, డీ.ధర్మారం, కాట్రియాల గ్రామాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్రవంతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నిజాంపేటలోని రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే తనయుడు పునీత్‌రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నార్సింగి మండలం జెప్తిశివునూర్లో వైస్‌ఎంపీపీ సుజా త, సర్పంచ్ షరీఫ్, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు కేక్ కట్ చేశారు. మెదక్‌లో జరిగిన వేడుకల కు శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ వెళ్లారు.