పటాన్చెరు టౌన్, జూన్ 4: మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావుకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లిన పుష్పగుచ్చం అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావును కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.