యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరితో కలిసి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు.
- హుస్నాబాద్ మెగా జాబ్ మేళాలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూన్ 24: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరితో కలిసి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి ఆయా కంపెనీల్లో కావాల్సిన ఉద్యోగాల భర్తీకి గ్రామీణ నిరుద్యోగ యువతను ఎంపిక చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. అందులోభాగంగానే హు స్నాబాద్‌లో జరుగుతున్న జాబ్ మేళాకు 60కిపైగా కంపెనీలు వచ్చాయన్నారు. సుమారు 6వేల మంది యువతీయువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరు కాకుండా మరో రెండు వేల మంది వరకు మేళాకు హాజరయ్యారని తెలిపారు. జీరో టు పీజీ వరకు చదువుకున్న వారందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం దొరుకుతుందన్నారు. విదేశాల్లో కూడా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉన్నందున నిరుద్యోగులు ఓపికతో ఉండి ఆయా కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. త్వరలోనే మండలాల వారీగా కూడా జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి అక్కడి ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా మారుస్తామని, దీంతో కూడా కొంతమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకే చోట ఇన్ని కంపెనీలు రావడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చిన యువతీ యువకులు పాల్గొన్నారు.
జాబ్ మేళాకు అనూహ్య స్పందన..
హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. జాబ్ మేళాలో 5,225మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మొత్తం 8,795మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇందులో 1,310మంది యువతీయువకులకు అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 3,887మంది షార్ట్ లిస్టును వివిధ కంపెనీలు తయారు చేశాయని, వీరందరినీ త్వరలోనే ఆయా కంపెనీలకు పిలిపించి ఇంటర్వ్యూలు, స్కిల్స్ నేర్పించి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. జాబ్‌మేళా నిర్వహణలో భాగస్వాములైన అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

