IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
IKP Centers | ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి గిట్టుబాటు ధర పొందాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ అన్నారు.
రాయపోల్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ( IKP Centers ) ధాన్యం తరలించి గిట్టుబాటు ధర పొందాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
దళారుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు. ఐకేపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే వర్షాలు లేక రైతులకు పంట నష్టం జరిగిందని. ఉన్న పంట కొనుగోలు కేంద్రం వద్ద తరలించిన రైతులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియాల స్వామి, ఐకేపీ ఏపీఎం యాదగిరి, సీసీ నాగరాజు, వార్డు సభ్యులు కరుణాకర్ , సునంద, నర్సింలు, నాయకులు తప్పెట సుధాకర్ , రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
IPE Director | ఐపీఈ డైరెక్టర్గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

