అప్రమత్తతే.. ఆయుధం
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో
వేసవిమంటలతో జర జాగ్రత్త
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేయాలి
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ‘డెమో’ కార్యక్రమాలు
ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
మెదక్‌రూరల్, మే 23 : వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో పాటు కొన్ని సమయాల్లో ప్రాణనష్టం కూడా తప్పకపోవచ్చు.
అవగాహన కార్యక్రమాలు
అగ్ని ప్రమాదాలు నివారించేందుకు మెదక్ జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలు, పరిశ్రమల వద్ద, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన కిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు వివరి స్తున్నారు. మంటలు వ్యాప్తి చెందినప్పుడు ప్రమాదాల బారి నుంచి ఎలా బయటపడాలి, దట్టంగా పొగ కమ్ముకున్నప్పుడు ఎలా బయటకు రావాలో అనుసరించాల్సిన పద్ధ్దతులు వివరిస్తున్నారు.
అగ్నిమాపక వారోత్సవాలు
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా వారం రోజుల పాటు జిల్లాలో రద్దీగా ఉండే ప్రాంతాలు దవాఖానలు, కంపెనీలు, ఆర్టీసీ బస్టాండ్లు ,పెట్రో ల్ బంక్‌లు, గ్యాస్ సరాఫరా కేంద్రాల వద్ద ప్రత్యే క డెమోతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నేరుగా 101కు ఫోన్..
అగ్ని ప్రమాద సమయంలో వెంటనే 101 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. అలా చేసినప్పుడే వివరాలను నమోదు చేసుకొని అగ్నిమాపక సిబ్బంది వెంటనే సేవలకు ఉపక్రమించడానికి ఆస్కారముంటుంది.
వేసవిలో అగ్ని ప్రమాదాలు
ప్రధానంగా వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో గుడిసెలు, గడ్డివాములు అగ్ని ప్రమాదాలకు గురవుతుంటాయి. తరచుగా, గ్యాస్ లీక్, విద్యుదాఘతంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ప్రమాదాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నది. ఇంటికి లాక్ వేసి వెళ్లేటప్పుడు విద్యుత్ బోర్డులను స్విచ్ఛాప్ చేయాలి. పరిశ్రమల దగ్గర కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి టెబుల్‌పై పుస్తకాలు పెట్టకూడదు. గ్యాస్ సిలిండర్ ధ్వంసమైతే గోనె సంచితో.. నీటిని చల్లాలని సూచిస్తున్నాం. సినిమా హాళ్లు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, దుకాణాలు,దవాఖానలు, రైస్ మిల్లుల్లో అగ్ని ప్రమాద నిబంధనలు, తప్పకుండా పాటించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందిం చాలి. -అమర్నాథ్ గౌడ్, మెదక్ ఫైర్‌స్టేషన్ అధికారి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు ,లెటర్లు ఇతర మండే పదార్థాలు అందుబాటులో ఉంచొద్దు.
- కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్నిపుల్లలు ఆర్పకుండా అ జాగ్రత్తగా పారేయొద్దు.
- ఇండ్లల్లో వాడే ఏసీలు ఓవర్లోడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైన వైరింగ్‌ను మాత్రమే వాడాలి.
- దవాఖానలు, దుకాణ సముదాయాల్లో ఆర్సీసీ, కాంక్రీట్ స్లాబ్‌లను మాత్రమే పైకప్పుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి.
- పరిశ్రమలవద్ద తగినంత నీరు ఇతర అగ్ని మాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేయాలి.

Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

