ఎండుతున్న పంటలు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో 18 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా సిద్దిపేట డివిజన్లో 14 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
- అడుగంటుతున్న భూగర్భజలాలు
- మంత్రి ఇలాకాలో 18 గంటలు విద్యుత్ సరఫరా
- సిద్దిపేట డివిజన్లో 14 గంటలు మాత్రమే..
కొండపాక, ఏప్రిల్ 1 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో 18 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా సిద్దిపేట డివిజన్లో 14 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట పొలాలు ఎండిన దాఖలా లు లేవని, సాగునీటి కోసం కృషిచేసి ఘనత కేసీఆర్‌కే దక్కిందని రైతులు గుర్తుచేస్తున్నారు. మండలంలోని బం దారం, దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, దర్గా, దుద్దెడ తదితర గ్రామాల్లో సాగునీటి కాలువలు లేక వరి, మొకజొన్న, కూరగాయ పంటలు పూర్తి గా ఎండిపోవడంతో జీవాలు మేస్తున్నాయి. సిరిసినగండ్ల, మర్పడగ, తి మ్మారెడ్డిపల్లి, కొండపాక, జప్తినాచారం, దమ్మకపల్లి, ఖమ్మంపల్లి గ్రామాల్లో సాగునీటి కాలువలు ఉన్నా నీరు రాక పంటలుఎండిపోతున్నాయి.
కుకునూరుపల్లి మం డలంలోని చిన్నకిష్టాపూర్, రామచంద్రాపూర్ గ్రామా ల్లో కాలువలు లేక సాగునీరు రావడం లేదని రైతులు మండిపడుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ నీళ్లు రావడంలేదని, ఇతర జిల్లాలకు మాత్రమే సాగునీరు సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పం దించి సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

