Pocharam Srinivasa Reddy | మోసగించిన కాంగ్రెస్ను ఓటుతో బుద్ధి చెప్పాలి : మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
Pocharam Srinivasa Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.
మెదక్ : అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ (Congress) పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ (Former Speaker) పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivasa Reddy) పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో మెదక్ బీఆర్ఎస్(BRS) ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రూ. 500 అదనంగా ఇచ్చి పంట కొనుగోలు చేస్తామని, పంటలకు నిరంతరాయంగా కరెంట్(Power) ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులు అప్పు లేకుండా వ్యవసాయం చేసే స్థాయికి ఎదుగాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ రైతు బంధును ప్రారంభించారని వెల్లడించారు. పరిపాలన చేసే సత్తా కాంగ్రెస్కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వెంకట్ రాంరెడ్డి(Venkatram reddy) మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటి చేస్తున్నానని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి నిధులు సాధించి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నిలకడ లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి, అబద్ధాలు చెప్పే వ్యక్తి రఘునందన్ అని విమర్శించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

