ధాన్యాన్ని త్వరగా తరలిస్తాం
కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని త్వరగా తరలిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం ఆయన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 300 కేంద్రాలు ఉండగా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు.
- మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్
కౌడిపల్లి, మే 30: కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని త్వరగా తరలిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం ఆయన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 300 కేంద్రాలు ఉండగా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. మిగిలిన 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరగా తరలిస్తామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు అందజేస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు వస్తున్నాయా, లేబర్ కొరత ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో 4వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అందజేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా అందజేస్తామని ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దన్నారు. అనంతరం తునికి జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. జూన్ 10లోగా పాఠశాలల మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. నాగసాన్పల్లిలోని ఎరువుల షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. మండలానికి 200 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల పెద్ద జనుము విత్తనాలు వచ్చాయని చెప్పారు. మరో 95 క్వింటాళ్ల జీలుగ, 120 క్వింటాళ్ల జనుము విత్తనాలు వస్తాయన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ఆంజనేయులు, ఏడీఏ పుణ్యవతి, ఏవో స్వప్న, ఇతర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

