హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు లేదు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నీలం మధుకు లేదని బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, రైతు బంధు సమితి మాజీ మండల కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకిషన్‌రెడ్డి అన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), జూలై 19 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నీలం మధుకు లేదని బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, రైతు బంధు సమితి మాజీ మండల కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతు బండి కిష్టయ్య ఆత్మహత్యాయత్నానికి కారణమైన నాయకులే దొడ్డిదారిన దవాఖానలో చికిత్స పొందుతున్న రైతును పరామర్శించడం సిగ్గుచేటన్నారు.
దవాఖానలో బాధిత రైతు భార్యకు రూ.లక్ష ఇచ్చి తమ పేరు చెప్పవద్దని బతిమిలాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరుపేద రైతు కిష్టయ్య కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతుకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌లు కాసపురం సంజీవరెడ్డి, ముత్యాల కనకయ్య, ఏమల్ల రాజిరెడ్డి, చిట్కుల సురేందర్‌రెడ్డి, పెద్దంకుల శ్రీనివాస్‌గౌడ్, గజ్వేల్ కరుణాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

