కేసీఆర్ దీక్ష.. ఒక చరిత్ర
‘నవంబర్ 29 అంటే ఒక చరిత్ర....తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు..తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం ఉంది. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర ...కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర..ఎన్నో త్యాగాల ఫలితం నేడు నీటి ఈ తెలంగాణ రాష్ట్రం.
- త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారం
- ఉద్యమంలో రేవంత్ పాత్ర ఎంత..
- తెలంగాణ వచ్చేదాకా తన ప్రాణం పోదని ధైర్యం చెప్పిన నేత కేసీఆర్
- కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ మనోభావాలు దెబ్బతీసేలా ఏపీ వాదనలు
- ఏపీ తీరుపై కిమ్మని కాంగ్రెస్ సీఎం, మంత్రులు
- ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- సిద్దిపేటలో దీక్షాదీవస్ వేడుక
- భారీ బైక్‌ర్యాలీ, అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం
సిద్దిపేట, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నవంబర్ 29 అంటే ఒక చరిత్ర….తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు..తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం ఉంది. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర …కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర..ఎన్నో త్యాగాల ఫలితం నేడు నీటి ఈ తెలంగాణ రాష్ట్రం.తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదూ అని తనకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్…నేను చనిపోను.. ఒకవేళ చస్తే నా శవంపై తెలంగాణ జెండా పెట్టాలని కేసీఆర్ అన్నాడు’.. అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గుర్తుచూశారు. శనివారం సిద్దిపేట పట్టణంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. 16 ఏండ్ల చారిత్రాత్మక దీక్షను స్మరిస్తూ సిద్దిపేటలో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు.

సిద్దిపేట జిల్లాకేంద్రం పొన్నాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్ష దివస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, పార్టీ శ్రేణులతో కలిసి హరీశ్‌రావు వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన ఉద్యమకారుడు అందెశ్రీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతు.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకత పుస్తకం (The Coalition Years)లో కేసీఆర్ కోసం ఒక పేజీ రాశారన్నారు. డిసెంబర్ 9న ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమేనన్నారు.

దీక్ష చేసింది బీఆర్ఎస్ నాయకులైతే, కక్షలు కాంగ్రెస్ వాళ్లవని హరీశ్‌రావు మండిపడ్డారు. మిలియన్ మార్చ్ మా వంతు.. మిలియన్ల కొద్ది డబ్బుల మూటలు ఢిల్లీకి పంపుడు కాంగ్రెస్ నాయకుల వంతు అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండరాం దగ్గర అయ్యారని విమర్శించారు. మన నిధులు, మన నీళ్లు మనకు దకేలా చేసింది కేసీఆర్ అన్నారు. కృష్ణా నది నీళ్ల పంపకంపై ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రిబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదనలు వినిపిస్తోందన్నారు. మనల్ని కించపరిచేలా మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ మంత్రులు పల్లెతు మాట అనడం లేదన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు చీము నెత్తురు ఉంటే ఏపీ తీరును ఖండించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే మనరాష్ట్రం పచ్చగా మారిందన్నారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి తెలంగాణ భూములు అమ్ముకునేందుకు రేవంత్‌రెడ్డి చూస్తున్నాడని హరీశ్‌రావు విమర్శించారు.
అమరుల కుటుంబాలకు సన్మానం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడకు చెందిన అవునూరు సత్తయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో అమరుడయ్యారు. కేసీఆర్ వారి కుమారుడు సందీప్‌కు విద్యాశాఖ లో ఉద్యోగం ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అమరుడు కాగా, అతని తమ్ముడు శ్రీధర్‌కు వెటర్నరి శాఖలో ఉద్యోగం ఇచ్చా రు. కన్నయిన ఐలయ్య ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడుతూ ఇక తెలంగాణ రాదని, ఈ కాంగ్రెస్ ఇవ్వదనే ఆవేదనతో చనిపోగా, ఆయన కుమారుడు నర్సింలుకు ఉద్యోగం ఇచ్చారు.దీక్షా దివస్ సందర్భంగా వారి త్యాగాలను కొనియాడారు. వారిని స్మరి స్తూ వారి కుటుంబ సభ్యులను హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు.
ఉద్యమ గడ్డలో నాటి ఉత్సాహం

తెలంగాణ ఉద్యమ యోధులను స్మరిస్తూ.. మహనీయులకు నివాళులర్పిస్తూ.. సిద్దిపేట పట్టణం ప్రధాన రహదారి గుండా శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పొన్నాలలోని బీఆర్ఎస్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో అంబేదర్ విగ్రహానికి హరీశ్‌రావు, నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంబించారు. కోటిలింగాల ఆలయం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పించారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వైపు బైక్‌ర్యాలీ సాగు తూ, పాత బస్టాండ్ వద్ద పూలే విగ్రహానికి, అంబేదర్ విగ్రహానికి నివాళులర్పించారు. బీజేఆర్ చౌరస్తా వద్ద బీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద అమరులను స్మరించుకున్నా రు. 1531 రోజుల దీక్షా శిబిరం స్మృతి చిహాన్ని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పున : ప్రారంభించారు.
మరో పోరాటానికి సిద్ధం కావాలి
కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధం కావాలని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమ తరహాలో పోరాడాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట, దుబ్బాక కీలక పాత్ర పోషించాయని, దివంగత రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. దీక్షా దీవస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో ముందుండి పోరాడుతామన్నారు.
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
నిజమైన చరిత్రను ప్రజల ముందుంచాలి
నిజమైన చరిత్రను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందిని మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 1969 ఉద్యమం అర్ధాంతరంగా ఆగిపోతే, మలిదశ ఉద్యమం రాష్ట్ర సాధన వరకు కొనసాగిందని ఆయన అన్నారు. కేసీఆర్ దీక్ష యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. తెలంగాణ ఎవరి దయ వల్ల రాలేదని, ప్రజల పోరాటం, కేసీఆర్ దీక్ష వల్లే వచ్చిందన్నారు. కేసీఆర్ దీక్ష వల్ల కాదు సోనియా వల్లే రాష్ట్రం వచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అనడం సరికాదన్నారు. సోనియాగాంధీని బలిదేవత అన్నది రేవంత్ కాదా అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు ప్రయత్నిస్తున్నాని దేశపతి విమర్శించారు.
– మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

