జుట్టు.. అదిరేట్టు
నేటి యువతరం అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఏం చేసినా అది ట్రెండ్‌కు తగ్గట్లుగా చేస్తున్నారు. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని తాపత్రయపడుతున్నారు. హెయిర్ కటింగ్‌లోనూ కొత్త కొత్త ైస్టెల్స్ను అనుసరిస్తున్నారు.
- ట్రెండీ హెయిర్ ైస్టెల్స్పై కుర్రకారు క్రేజ్ నయా లుక్ కోసం తహతహ
- చిన్నారులు, యువతలో ‘థింక్ డిఫరెంట్’ కాన్సెఫ్ట్
- మాడ్రన్‌గా మారుతున్న హెయిర్ సెలూన్లు
- పల్లెల్లోనూ హెయిర్ ైస్టెల్స్పై పెరుగుతున్న ఆసక్తి
బొల్లారం, మే 30: నేటి యువతరం అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఏం చేసినా అది ట్రెండ్‌కు తగ్గట్లుగా చేస్తున్నారు. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని తాపత్రయపడుతున్నారు. హెయిర్ కటింగ్‌లోనూ కొత్త కొత్త ైస్టెల్స్ను అనుసరిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా యువకులు థింక్ ఢిపరెంట్ కాన్సెప్ట్‌ను ఐప్లె చేస్తున్నారు. సరికొత్త ైస్టెల్స్లో కటింగ్, షేవింగ్ చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన సినీ హీరోలు, సెలబ్రిటీలను నిత్యం ఫాలో అవుతున్నారు. వైరల్‌గా మారిన హెయిర్ ైస్టెల్‌ను ఇట్టే పట్టేసుకుంటున్నారు. పట్టణాకే పరిమితమైన ఈ హెయిర్ ైస్టెల్స్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు ఎటూ చూసిన యువత తమ ఢిపరెంట్ హెయిర్ ైస్టెల్స్‌తో త‘లుక్’మని మెరుస్తున్నారు.

నయా లుక్ కోసం కుర్రకారు తాపత్రయం…
కాలేజీ యువకులే కాకుండా వివిధ పనులు చేస్తున్నవారు సైతం డిఫరెంట్ ైస్టెల్స్లో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో పాఠశాలకు వెళ్లే విద్యార్థి మొదలుకొని కాలేజీలకు వెళ్లే యువత వరకు నయా లుక్ కోసం తాపత్రయ పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త హెయిర్ ైస్టెల్స్ పుట్టుకొస్తుండడంతో వాటినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
ట్రెండ్‌కు తగ్గట్లుగా హెయిర్ కటింగ్…
నేడు యువతరం తమ ఆలోచనలకు తగ్గట్లుగా నచ్చిన హెయిర్ ైస్టెల్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇందులో ఖర్చుకు సైతం వెనకాడకుండా ఇష్టాలను నేరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫంకీ, పెప్, స్టెప్ హెయిర్ ైస్టెల్స్కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాంతాలను బట్టి వీటి ధరలు రూ.200 నుంచి రూ.350 వరకు ఉంటున్నాయి. మోడలింగ్ హెయిర్ ైస్టెల్స్పై యువత ట్రెండ్‌కు తగ్గట్లుగా అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు భిన్న రీతుల్లో తమ హెయిర్ ైస్టెల్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
గుడ్ లుకింగ్ కోసం…
సాధారణ కటింగ్, షేవింగ్ కాకుండా యువతలో డిఫరెంట్‌గా కనిపించాలనే ఉద్దేశంతో గుడ్ లుకింగ్ కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు. అలా ఉండడానికే ఇష్టపడుతూ కొత్త హెయిర్ ైస్టెల్స్ను ముదుండి స్వాగతిస్తున్నారు. యువత ఎక్కువగా పెప్, ఫంకీ, స్పెస్, లాంగ్ హెయిర్ స్ట్రైయిటింగ్, కర్లింగ్, జిగ్‌జాగ్, బిగ్‌షాట్ వంటి వెరైటీ కటింగ్లతో అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఫంకీ, పెప్ స్ట్రైయిటింగ్ హెయిర్ ైస్టెల్స్పై యువత ఎక్కువగా మక్కువ చూపుతూ గుడ్ లుకింగ్ ఉండాలని తహతహలాడుతున్నారు.
పట్టణాల నుంచి పల్లెల వరకు…
మొన్నటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఢిపరెంట్ హెయిర్ కటింగ్ ైస్టెల్స్ ఇప్పడు గ్రామాలకు సైతం విస్తరించాయి. ఒకప్పుడు సినిమా హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలకే పరిమితమైన విభిన్న హెయిర్ ైస్టెల్స్ ఇప్పుడు అన్ని వైపులా పాకాయి. ప్రస్తుతం కుర్రకారు ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటే చాలు అది ట్రెండ్‌గా మారుతోంది. యువత అభిరుచి మేరకు సెలూన్ల నిర్వాహకులు సైతం ట్రెండింగ్‌లో ఉన్న హెయిర్ ైస్టెల్స్ను ఫాలో అవుతున్నారు.
ట్రెండ్‌నే ఫాలో అవుతున్నాం..
ప్రస్తుతం ఫంకీ, జిగ్‌జాగ్, స్ట్రైయిటింగ్ హెయిర్ కటింగ్లనే యువత ఎక్కువగా కోరుతుండ్రు. వారి అభిరుచుల మేరకు భిన్న తరహాలో కటింగ్‌లు చేస్తున్నాం. శుభాకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే మరి ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. యువతే కాకుండా చిన్న పిల్లలకు కూడా వారి
తల్లిదండ్రులు ైస్టెల్ కటింగ్‌లు చేయిస్తుండ్రు. సమయం వెచ్చించి మరీ, ఖర్చులకు వెనకాడకుండా కొత్తదనాన్ని కోరుతుండ్రు. మెకోవర్తోపాటు ఇలా ట్రెండీ హెయిర్ కటింగ్‌లపై యువతకు విపరీతమైన క్రేజ్ ఉంది.
– త్రినాథ్, కటింగ్ సెలూన్ నిర్వాహకుడు, బొల్లారం
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

