పరామ పావనం
తిరు కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాషికాన్ని నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెండ్లి కూతురుగా సీతమ్మ కల్యాణ వేదికపై కొలువు దీరగా.. సంపగి నూనెను కురులకు దువ్వి.. సొంపుగా కస్తూరి నామం దిద్ది.. చెంపన వాసి చుక్కను పెట్టి.. పెండ్లి కొడుకుగా రామయ్య కొలువు దీరగా.. నవమి మూహుర్తాన..
- కనులపండువగా శ్రీరామ నవమి
- ఉమ్మడి జిల్లాలో రాములోరి కల్యాణం
- అభిజిత్ లగ్నంలో ఒక్కటైన జంట
- కల్యాణ వేదికలుగా ఊరు.. వాడా
- తిలకించి.. పులకించిన భక్తజనం
- మార్మోగిన శ్రీరామ నామం
మహబూబ్‌నగర్, మార్చి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తిరు కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాషికాన్ని నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెండ్లి కూతురుగా సీతమ్మ కల్యాణ వేదికపై కొలువు దీరగా.. సంపగి నూనెను కురులకు దువ్వి.. సొంపుగా కస్తూరి నామం దిద్ది.. చెంపన వాసి చుక్కను పెట్టి.. పెండ్లి కొడుకుగా రామయ్య కొలువు దీరగా.. నవమి మూహుర్తాన.. అభిజిత్ లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల చప్పుళ్ల మధ్య.. సీతమ్మ మెడలో రామయ్య మాంగల్యధారణ చేయగా.. ఆణిముత్యాలే తలంబ్రాలుగా మెరిసిన సీతారాముడి కల్యాణ ఘట్టం వైభోవంగా సాగింది. రాములోరి కల్యాణాన్ని భక్తజనం కనురెప్ప వాల్చకుండా వీక్షించి పులకించిపోయారు.
మదిలో శ్రీరాముని నామస్మరణతో పరవశించిపోయారు.. ‘జగదభిరామా.. జానకి రామా’.. ‘జై శ్రీరామా.. జైజై శ్రీరామా’ అంటూ స్వామిని స్మరించుకొని పునీతులయ్యారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఊరూ.. వాడా రామయ్య కల్యాణ వేదికలుగా మారాయి. సీతారాముల ఉత్సవ మూర్తులను రథంపై, పల్లకీలో ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

