అయిజ, మార్చి 6 : పొట్టేళ్ల పోట్లాట రసవత్తరం గా సాగింది. అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోరు పోటాపోటీగా జ రిగింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి 30 పొట్టేళ్లు వచ్చాయి.
మొదటి బహుమతి హైదరాబాద్కు చెందిన కిల్లర్ గ్రూప్ (రూ.50,016), రెం డో బహుమతి హైదరాబాద్కు చెందిన డెక్కన్షిప్ ఫైటర్స్ (రూ.35,016), మూడో బహుమతి కర్నూ ల్ జిల్లా గొందిపర్లకు చెందిన ప్రభాస్ (రూ. 20,016), నాలుగో బహుమతి నంద్యాల జిల్లా ఆంద్రకట్లకు చెందిన రమేశ్(రూ.10,016) పొట్టేళ్లు గెలుపొందాయి. విజేతల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు.