భారీగా మోహరించిన పోలీసు బలగాలు
ఎమ్మెల్యే బీరం, మాజీమంత్రి జూపల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీరం వాహనంపై పూల వర్షం కురిపించిన టీఆర్ఎస్ శ్రేణులు
కొల్లాపూర్/రూరల్, జూన్ 26 : నియోజకవర్గ కేం ద్రంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొన్నాళ్లుగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒక రు అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చావేదికకు సవా ల్, ప్రతి సవాల్ విసురుకున్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో ఇద్దరు కూడా ముఖాముఖీ చర్చలకు సిద్ధమయ్యా రు. అయితే దీనికి ఎస్పీ మనోహర్ శాంతిభద్రతల సమ స్య తలెత్తే అవకాశం ఉన్నందునా అనుమతి నిరాకరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావాలని ఎమ్మెల్యేను జూపల్లి డిమాండ్ చేయగా సవాల్ స్వీ కరించిన ఎమ్మెల్యే బీరం నీ ఇంటికే వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం వారాంతపు సంత కావడంతో పట్టణంలో అలజడి నెలకొంది. ఎమ్మెల్యే ఇంటి వద్దకు వేలాదిగా టీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ముందస్తుగా ఎమ్మెల్యే బీ రం ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసు లు మోహరించారు. బారీకేడ్లను తోసుకొని జూపల్లి ఇం టికి వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే బీ రం రాకకోసం జూపల్లి తన ఇంటి వద్దనే ఎదురుచూ స్తూ ఉండిపోయారు. ఉదయం 10:30గంటలకు జూప ల్లి ఇంటికి బయలుదేరుతుండగా ఎమ్మెల్యే బీరాన్ని బలవంతంగా ఏఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని తరలిస్తుండగా అడ్డుపడిన టీఆర్ఎస్ నాయకులను కొందరిని పోలీసులు డీసీఎం వాహనాల్లో ఎక్కించారు. ఎమ్మెల్యేను తీసుకెళ్తున్న వాహనాన్ని అనుసరిస్తూ వేలాదిగా పార్టీశ్రేణులు తరలివచ్చారు. ఎన్టీఆర్ చౌరస్తాకు పోలీసు వాహనం రాగానే వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించా రు. వేలాదిగా కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితిని అం చనా వేసినా పోలీసులు వెంటనే ఎమ్మెల్యేను దారి మ ళ్లించి పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జూపల్లిది చిల్లర రాద్ధాంతం : ఎమ్మెల్యే బీరం
మాజీ మంత్రి జూపల్లి చిల్లర రాద్ధాంతం చేస్తున్నా రు. మామిడి ప్రాసెసింగ్ కేంద్రం, సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, నేషనల్ హైవే, గోపల్‌దిన్నె లింక్ కెనాల్ ఆయ న తెచ్చిండా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతులకు స మృద్ధిగా సాగు, తాగునీరు ఇస్తున్నందుకా, ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నందుకే ఈ గొడవని ఎద్దేవా చేశారు. మం త్రిగా ఉన్నప్పుడు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు. శాం తి భద్రతలకు భంగం చేయాలని జూపల్లి కుట్ర చేస్తున్నారని, చట్టం అందరికీ సమానమే అని పేర్కొన్నారు.
అప్పు చేశా.. తప్పు చేయలేదు : మాజీ మంత్రి జూపల్లి
నేను బ్యాంక్‌లో తీసుకున్న రూ.7కోట్ల లోన్‌కు రూ. 14కోట్లు కట్టా. నేను అప్పు చేశా..కానీ తప్పు చేయలే దు మాజీ మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. తనపై ఆరోపణలను రుజువు చేయాలని 15రోజులు స మయం ఇస్తే ఎమ్మెల్యే స్పందించలేదన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా రైతాంగానికి సాగునీరందించే కెనాల్‌ను సరిచేయాలని,రైతుల సమస్యలు పరిష్కరించాలంటే నా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎమ్మెల్యే ఆరోపణలు చే శారు. బోరు బావుల కరెంట్ బిల్లుల వసూలు కోసం ఆనాడు విద్యుత్ అధికారులు స్టార్టర్లు తీసుకెళ్లినప్పుడు, తెలంగాణ ఉద్యమాల్లో నా చరిత్ర ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. ఎప్పుడూ వెనుకడుగు వేయలేదన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే ఆడిచ్చినట్లుగా ఆడుతున్నారని ఆరోపించారు. కండువా కట్టుకుంటావా లేదా అని బెదిరింపులు చేస్తున్నారని, దీనికి కారణం ఎమ్మెల్యేనే అన్నారు. తానూ టీఆర్ఎస్లోనే ఉన్నా అని ఈ సందర్భంగా మీడియాతో వెల్లడించారు.