అభివృద్ధిపై చర్చకు సిద్ధం
‘మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్‌టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు.
- వలసల నుంచి ఉపాధినిచ్చే స్థాయికి తీసుకొచ్చాం..
- పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
- విమర్శలు మానండి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, మే 11 : ‘మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్‌టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ముందుగా కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం మన్నె మాట్లాడుతూ 2014కు ముందు పాలమూరులో తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదని.. మోకాళ్లలోతు మట్టి గుంతలతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదన్నారు. అలాంటి దీనస్థితిలో ఉన్న మనం కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు చేసేందుకు ఐదు నెలల సమయమిచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. అభివృద్ధి, హామీలపై వారికి సోయేలేదని విమర్శించారు. తనను ఓడించేందుకు బీజెపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగప డే పనులు ఒక్కటీ చేయలేదని గుర్తుచేశారు.
తప్పుడు ప్రచారంతో గెలిచారు : శ్రీనివాస్‌గౌడ్
‘పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఓర్వలేని కొందరు నేను భూ కబ్జా లు చేస్తున్నానని.. కేసులు పెట్టారు. మాపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. అధికారం చేపట్టాక ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అడుగుతుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు తప్పా.. అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు.’ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ప్రతిపక్షాలపై విమర్శలు మాని జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డైనేజీ పనులు చేసి, ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలన్నారు.. ఉచిత గ్యాస్, ఉచిత కరెంట్ ఏమయ్యా యి? పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా అమలు చేశారా? సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి గెలిచారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు వెనక్కి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజెపీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోంద ని, కాంగ్రెస్ పార్టీ మరోమారు మోసం చేయడానికి సిద్ధమైందని దుయ్యబట్యారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

