ఆవిర్భావ దినోత్సవం అదరాలె
జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ల క్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌ డ్ మాట్లాడారు.
- పదేండ్లలో తెలంగాణను దేశం గుర్తించేలా అభివృద్ధి చేశాం
- మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె
మహబూబ్‌నగర్ అర్బన్, మే 31: జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌ డ్ మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో మలిదశ ఉ ద్యమ పోరాటంతో దేశంలో 33 పార్టీలను ఒప్పించి తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఆనాడు కే సీఆర్ 14ఏండ్లు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని, వారి నాయకత్వంలో మేము భాగస్వాముల మై తెలంగాణ సాధిస్తే.. ఇప్పుడు ఆ ఉద్యమకారు డు కేసీఆర్‌ను విమర్శించడం సరైనది కాదన్నా రు. తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లు పూర్తి స్థాయి లో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కృషి చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అణుగుణంగా కేసీఆర్ పాలన సాగిందని, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీ రు అందించామన్నారు. రైతులకు పెట్టుబడి సాయ ం, నాణ్యమైన కరెంట్ చివరకు పండించిన పంట ను కూడా కొనుగోలు చేశామన్నారు. కేసీఆర్ ప్రభు త్వ హయాంలో విత్తనాల కోసం రైతులు ఎప్పుడూ చెప్పులు క్యూలైన్లో పెట్టలేదన్నారు. అబద్ధపు హా మీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. పాలమూరు- రంగారె డ్డి ప్రాజక్టును 80 శాతం పనులు పూర్తి చేశామని మిగిలిన పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పేరును అడ్డుకునేందుకు మహబూబ్‌నగర్ నియోజకవర్గంతోపా టు రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులను నిలిపివేయ డం వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర చిహ్నాలు మార్పు నిర్ణయాన్ని వెంట నే వెనక్కి తీసుకోవాలని సూచించారు. అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ 1 వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ పబ్లి క్ గార్డెన్ నుంచి ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ఘనంగా నివాళులర్పిస్తామన్నారు. 2న తె లంగాణ భవనంలో ఉదయం 9గంటలకు కేసీఆర్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 3వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులతో క లిసి జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టించారన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే విషయాలను ప్రజలు గమనించాలని సూ చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పే రుతో అధికారంలోకి వచ్చి ఆరునెలల్లోనే ప్రజలను అరిగోస పెడుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, నాయకులు వెంకన్న, గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

