బండలతో ఇంటికి అలంకరణ
గడిచిన మూడు పదుల సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే ఇంటి లోపల బండలు ఉం టే ఆ ఇల్లు పెద్దింటి వారిదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇల్లు అంతా రఫ్ బండలు పర్చిన ఆ గ్రామంలో ఒకటి,
- ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న గృహ నిర్మాణ యజమానులు
- ధర ఎక్కువైనా సరే…లుక్ ఉండాల్సిందే అంటున్న వైనం
- గ్రానైట్, మార్బుల్స్‌పై ప్రజల మక్కువ
- మార్కెట్లో ఫీట్‌కు రూ.50 నుంచి రూ.500 వరకు
మహబూబ్‌నగర్, జనవరి 22 : గడిచిన మూడు పదుల సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే ఇంటి లోపల బండలు ఉం టే ఆ ఇల్లు పెద్దింటి వారిదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇల్లు అంతా రఫ్ బండలు పర్చిన ఆ గ్రామంలో ఒకటి, రెండు ఇండ్లు తప్ప మరే ఇంటికి లోపల బండలు ఉండేవి కావు. తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా పశువుల పేడ, ఎర్రమన్నుతో కలిపి అలికి..ముగ్గుతో అలకరణ చేసిన త ర్వాతనే పొయ్యి అంటించేందుకు మన పెద్దలు శ్రద్ధ తీసుకునే వారు.
నేడు ఆ కాలానికి కాలం చెల్లింది. ఇల్లు కాదు కాదా…ఇంటి లోపల అడుగు భాగం కూడా మట్టిని కనిపించకుండా ఇల్లంతా తమకు ఇష్టమైన వివిధ రకాల బండ లు అమర్చి అలంకరిస్తూ ఇవి బాగున్నాయా ? అవి బాగున్నాయా ? అంటూ ఇంటికి వచ్చిన వారందరికీ చెప్పుకుం టూ ప్రచారం చేసుకుంటు న్న రోజులివి. ఒకరిని చూసి మరొకరు వివిధ రకాల రం గుల బండలతో తమ ఇండ్ల కు అలంకరించుకుంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మార్కెట్లో బండల వ్యాపారం చేసేందుకు చాలా మంది పోటీ పడుతుండ్రు. బండలు వేసుకునే ముందు ప్రతి ఇంటి యజమాని అవసరమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మోసానికి గురికాక తప్పదు. బండలకు వివిధ మోడల్స్‌లో మార్కెట్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
జరభద్రం
ఇల్లంతా ఎర్రమన్ను, పశువల పేడతో అలంకడంతోపాటు నిండుగా చుక్కల ముగ్గులు వేసి అలకరించే రోజుల కు కాలం చెల్లింది. ఈ ట్రెండ్ కొన్ని హోటళ్లలో మళ్లీ కనిపించే విధంగా అలంకరణ చేసి హోటల్స్ యజమానులు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ విషయం అటు ఉంచితే బండల ఉపయోగంలో మా త్రం చాలా మంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నారు. తీసుకునే సమయంలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్న వ్యక్తులు బం డలను కొనుగోలు చేసి ఇంటిలో వేసుకుంటే వారికి ఎంతో మేలు చేకూరుతున్నది. అన్ని రంగుల రంగుల బండలతో ఆశ్చర్యపోయి, ఏదో ఒక బండ తీసుకొనిపోయి ఇంటిలో అలంకరించినా తక్కువ సమయంలోనే ఆ బండలు దెబ్బతినే రోజులు కూడా ఉంటా యి. బండలు వేసే సమయంలో నాణ్యతను కూడా ప్రత్యేకంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతనే బండలు వేయిస్తే ఇండ్లు ఆకర్షణీయంగా నిలుస్తాయి.
మార్కెట్లో బండలు
గ్రానైట్, మార్బుల్స్, కట్నీ మార్బుల్స్, బేతంచర్ల, తాం డూరు, రఫ్, పాలిష్, ఇంటియన్ మార్బుల్స్, మక్రన్ మా ర్బుల్స్, శాంటిస్టోన్, గ్రానైన్ ఐరన్‌తోపాటు అనేక రకాల పేర్లతో ఆకర్షణీయమైన రంగుల్లో బండలు మార్కెట్లో అం దుబాటులో ఉన్నాయి. ఫీట్ రూ.50 నుంచి 500 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగళూర్, చిత్తూర్, కరీనంగర్, ఖమ్మం, వ రంగల్ తదితర ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కు బండలు వస్తాయి. గ్రానైట్‌లో ఐరన్ అధికంగా ఉండడంతో చాలా కూల్‌గా ఉండే స్వభావం ఈ బండల్లో ఉం టుంది. బండను గమనించి పూర్తిగా నిర్ధారించుకున్న త ర్వాతనే కొనుగోలు చేస్తే ఆ బండలు ఆ ఇంటిలో యేండ్ల తరబడి నాణ్యతతో ఉంటాయి.
నాణ్యత చాలా ముఖ్యం
నాణ్యతతో కూడిన బండలను ఇంటిలో వే స్తే ఆ లుక్ చాలా బాగుంటుంది. నాణ్యత అనే ది బండలోనే కాదు ప్రతి వస్తువు కొనుగోలు చేస్తేనే మంచి జరుగుతున్నది. మార్కెట్లో అ నేక రకాలుగా బండాలు రావడం జరిగింది. బండపై బాగా తెలిసిన వారితో కొనుగోలు చే యాలి. ప్రజలకు అందుబాటులో ధరలో ఉన్నాయి.
– మోసిన్‌ఖాన్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం మాజీ అధ్యక్షుడు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

