తాత అస్తికలు నిమజ్జనం చేసేందుకు వెళ్లి మనుమడు మృతి
వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకుంది.

విధి ఎంత బలీయమైనదో కదా ! తన తాత అస్తికలు నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన కార్తీక్ (24) తన తాత అస్తికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు బుధవారం కుటుంబసభ్యులతో కలిసి బీచుపల్లి పుష్కరఘాట్‌కు వచ్చాడు. నిమజ్జనం కార్యక్రమం అనంతరం కుటుంబీకులు అందరూ నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్వీటీ అనే అమ్మాయి ఘాట్ మెట్లను దాటుకుంటూ కొంచెం లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో స్వీటీ నదిలో కొట్టుకుపోయింది. ఇది చూసిన కార్తీక్ నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ ఈత రాకపోవడంతో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. అక్కడే పుట్టీలో ఉన్న జాలర్లు ఇది గమనించి.. స్వీటీ అనే అమ్మాయిని కాపాడారు. కానీ నీటిలో మునగడంతో కార్తీక్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా కార్తీక్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

