రైతుల ప్రయోజనం కోసం..
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్‌పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూర్ వరకు రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు విస్తరణ,
- నవాబ్‌పేటకు 133/11 సబ్‌స్టేషన్ మంజూరు
- 30 పడకల దవాఖాన, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
- రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవాబ్‌పేట, జూలై 15 : రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్‌పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూర్ వరకు రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు విస్తరణ, నవాబ్‌పేటలో రూ.80 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్‌స్టేషన్ మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు సంబంధిత అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలా గే డిగ్రీ కళాశాల, 30 పడకల దవాఖాన, మార్కెట్ యార్డు విస్తరణ, కారుకొండ, కొల్లూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంగ్లా రవి, జహీర్‌అక్తర్, వాసుయాదవ్, రాంచంద్రయ్య, భూపాల్‌రెడ్డి, మల్లేశ్‌యాదవ్, తుల్సీరాం నాయక్, నవాజ్‌రెడ్డి, బీజే పీ నేతలు బాలత్రిపుర సుందరి, మధుసూదన్‌రెడ్డి, రాజు, శ్రీను, గణేశ్, రామకృష్ణ, పాల్గొన్నారు.
పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి..
మిడ్జిల్/బాలానగర్, జూలై 15 : పాలమూరు జి ల్లా అభివృద్ధికి కృషి చేయడంతోపాటు గ్రామీణ ప్రాం తాల రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తామని మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. రెడ్డిగూడ కమాన్ నుంచి మిడ్జిల్ వరకు రూ.37కోట్ల తో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎంపీ డీకే అరు ణ, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రో డ్లు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృ ద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పాలమూ రు ఎత్తిపోతల పనులపై సమీక్ష నిర్వహించి, తర్వగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా బాలానగర్ చౌరస్తా నుంచి జడ్చర్ల మండలం గంగాపూర్ వరకు రూ.56 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిలతో కలిసి మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజాపూర్ తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నా టారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిరబో యి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్, నాయకులు శివకుమార్, అల్వాల్‌రెడ్డి, రబ్బాని, బాల్‌రెడ్డి, వెంకటయ్య, గౌస్, ప్రశాంత్‌రెడ్డి, బాలయ్య, సత్యంగుప్తా, వెంకటేశ్‌గౌడ్, బం గారు, శివ, సత్యంగౌడ్, నాగరాజు, మల్లయ్య, పర్వతాలు, శంకర్, నిరంజన్, అశోక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

