Medical assistance | కొల్లాపూర్‌లో పేద వృద్ధురాలికి వైద్య సహాయం అందించిన వైద్యులు
Medical assistance | ఆర్థిక పరిస్థితులతో వైద్యం అందక సతమతమవుతున్న వృద్ధురాలికి ప్రైవేట్ వైద్యులు తమ వంతుగా వైద్య సహాయం అందించి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
కొల్లాపూర్ : ఆర్థిక పరిస్థితులతో వైద్యం అందక సతమతమవుతున్న వృద్ధురాలికి ప్రైవేట్ వైద్యులు తమ వంతుగా వైద్య సహాయం అందించి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణానికి చెందిన వృద్ధురాలు కాలుకు పూర్తిగా ఇన్ఫెక్షన్ (Leg Infection) సోకి నడవరాని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికి దూరంగా ఉంటుంది.
ఈ సమయంలో కుటుంబ సభ్యులు స్థానిక మమత హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ వైద్యులు రెడ్డి దిలీప్‌కుమార్( Reddy Dileep Kumar ) , ఉషారాణి( Usharani ) ని సంప్రదించగా ఇద్దరు వృద్ధురాలిని పరీక్షించి వైద్యం చేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి అతి తక్కువ ఫీజుతో పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురైన కాలును తీసివేసి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.
గురైన , చిన్న దెబ్బలు తగిలిన వెంటనే చికిత్స చేయించుకుంటే ఫలితం ఉంటుందని వారు వెల్లడించారు. వృద్ధురాలికి ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

