మనకల నిజం పుస్తకావిష్కరణ
సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న నాగవరపు బాల్‌రాం అరుదైన వ్యక్తుల్లో ఒకరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు.
- తనను సాహిత్యం వైపు నడిపించడంలో బాల్‌రాం ఒకరు : నిరంజన్‌రెడ్డి
తెలుగు యూనివర్సిటీ, జూన్ 19 : సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న నాగవరపు బాల్‌రాం అరుదైన వ్యక్తుల్లో ఒకరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు. సీఎన్ఆర్ విద్యార్థులు నాగర్‌కర్నూల్ ఆధ్వర్యంలో ఆబిడ్స్ తిలక్‌రోడ్డులో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్తు హాలులో బుధవారం సాయంత్రం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాసాల సంపుటి మనకల నిజం పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి నిర్మలాదేవి-నారాయణరావుల పేరిట నెలకొల్పిన జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రము ఖ సాహితీవేత్త నాగవరం బాల్రాంకు ప్రదానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రసంగిస్తూ తనను సాహిత్యం వైపు నడిపించిన వారిలో బా ల్రాం ఒకరని ఆయన పేర్కొన్నారు. గత పదేండ్ల కాలంలో వివిధ పత్రికలకు తాను రాసి న వ్యాసాలను మన కల నిజం పేరుతో పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగిస్తూ గత పదేండ్లలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నిరంజన్‌రెడ్డి భవిష్యత్‌కు బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, దక్కన్ ల్యాండ్ పత్రిక ఎడిటర్ ఎం వేదకుమార్, సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, సాహితీవేత్తలు కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, చింతలపల్లి భాస్కరరావు, ప్రొఫెసర్ సీతారాం, వనపట్ల సుబ్బయ్య, కిషన్‌రావు, డాక్టర్ భూపేష్కుమా ర్, కొల్లాపురం విమల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

