జీవితమే కవిత్వం!
పద్యం మోస్తున్నంత సేపు నాకు అలసట తెలియలే యుద్ధం చేస్తున్నంత కాలం నన్ను ఓటమి వెంటాడలే!
పద్యం మోస్తున్నంత సేపు
నాకు అలసట తెలియలే
యుద్ధం చేస్తున్నంత కాలం
నన్ను ఓటమి వెంటాడలే!
దుఃఖమెప్పుడు రూప వస్తువు కాదు
అపురూపమయింది
ధైర్యంగా నిలబడే వాడిని
నిఖార్సుగా నిగ్గు తేలుస్తుంది!
ప్రవహించే నదిని చూస్తే
ఎవరికైనా భయమే
తెగించి ఎదురీదితేనే
ప్రమాదాలను జయించేది!
సముద్రం ఎంత ఎగిసిపడినా
అది ఆకాశాన్ని అందుకోలేదు
అల్పులెందరు వేలెత్తి చూపినా
ధీశాలి కీర్తి కిరీటం నేల జారదు!
చరిత్రలో ఎవరినైనా చూడండి
నిజాయితే వెన్నెముక
పద్యమైనా సరే బజారుకెక్కందే
దాని బలం నిరూపితం కాదు!
రెండు పాదాల మీద
సాగుతున్న నీ జీవితం
ఎంత క్లుప్తమో అర్థమైతే
నీకు కవిత్వమబ్బినట్లే!!
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
Read Today's Latest Literature-more Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

