కొత్త అడుగులేద్దాం రండి
సంధ్యారుణ సమయాల ముచ్చట్ల నుండి సన్నని వెన్నెల నేలతో నెమ్మదిగా మాట్లాడినప్పటివరకు విరిగిపోయిన బాల్యాన్ని జ్ఞాపకాలతో అతికిస్తుంటాము
సంధ్యారుణ సమయాల ముచ్చట్ల నుండి
సన్నని వెన్నెల నేలతో నెమ్మదిగా మాట్లాడినప్పటివరకు
విరిగిపోయిన బాల్యాన్ని జ్ఞాపకాలతో అతికిస్తుంటాము
ఆశల చిగుళ్లకు భాషాభిమానాల
ఆహ్వానాలు పలుకుతున్నప్పుడు
మైదానాలలో పూలవనాల నవ్వుల నుండి
హోరులెత్తుతున్న సంగీత ఝరుల వరకు
నోరారా పాడే పాట కోసం కొత్త అడుగులు వేద్దాం రండి!!
భూమి భయపడిపోతున్నప్పుడు
పూర్వగాథల పునర్ వ్యాఖ్యానాలు వింటున్నట్టు
పడిపోతున్న అమృత భావభాండాన్ని
పాటలతో పొదువుకోవాలనుకుంటున్నట్టు
మసి అంటిన ముఖాలను అద్దంలో చూసి
మనసారా తుడిచేసుకుంటున్నట్టు
రెపరెపలాడుతున్న జనపదం పాట
దీపాన్ని ఆరిపోనివ్వకుండా..
నువ్వూ నేనూ మనమంతా
మృదయ హస్తాలతో కాపాడేందుకు
నోరారా పాడే పాట కోసం
కొత్త అడుగులు వేద్దాం రండి!!
చెరువులను, గుడులను
ఓటు బండ్లు లాక్కుపోతుంటే
బండబారిన హృదయులమై
ఉయ్యాల పాటలనూ ఊగనివ్వడంలేదు!
డీజే చప్పుళ్లలో మూగబోతున్న అక్కాచెల్లెళ్ల
బతుకమ్మ పాటలను మళ్లెట్లా పట్టుకుందాము?
ఇవేమైనా కల్పిత కథలా!
అనంతంగా సాగే నిజాయితీ బతుకు గాథలు!!
ఇప్పుడు కావాల్సింది
డేటా డినాయిసింగ్ హృదయ తరంగాలు
వారసత్వ కాంతిపుంజాలు!
కల్పనలు తెలువని..
పల్లవులు మరువని..తరంగితాలు!
కుటుంబ తటాకాల కేరింతలలో
నిష్కల్మష పల్లె బతుకులను వెతుకుతూ
నోరారా పాడే పాట కోసం
కొత్త అడుగులు వేద్దాం రండి!!
ఎక్కడ పునాదిరాయి వేయాలో..
ఎక్కడ పాట భవనాలను నిర్మించాలో..
అక్కడ పలుకుబళ్లతో ఎలుగెత్తుదాం!
ఈ పాటలేమైనా ఒట్టి మాటల మూటలా?
రాగ తాళ భావరసాల బాటలు!
నుడికార సొగసుల ఊటలు!
ఇవి పురాతనం నుండి
ఆధునిక కాలాల ముత్యపు హారాలు !
మధురగాన లహరుల గగనాంచలాలు!
ఇక్కడ ఎడారులు లేవు..
ఇక్కడ భూప్రళయాలు లేవు..
ఇప్పుడు ఉన్నదల్లా పరాయీకరణ పరితాపమే!
ఇప్పుడున్నదల్లా మనది కాని
ప్రాంత అనుకరణల బాధలే!
ఈ చిక్కుముళ్ల చప్పుళ్ల నుండి
పాటను కాపాడుకోవడమే తెలివి కర్తవ్యం!
నోరారా పాడే పాట కోసం కొత్త అడుగులు వేద్దాం
రండి!!
భాషా మిశ్రమాన్ని అలవోకగా అందుకున్నాం
కోలాటాల సహజ సొగసులను
దాండియాలుగా చేసేశాం..
అయినా సరే..అయినా సరే
ఈ ప్రభావాల చోదితాలను
ఈ ప్రలోభాల ఉదంతాలను
భరింపు చోద్యాలుగా చూస్తున్నాం
అయినా సరే..
మనమీద కాలం కురిసినంతసేపూ
ఏఐ పన్నాగాల గుప్పిట చిక్కకుండా
చల్లని సాయం సంధ్యవేళ
నోరారా పాడే పాట కోసం
కొత్త అడుగులు వేద్దాం రండి!!
బతుకమ్మ పూలసిరి..
బతుకమ్మ పాట సిరి..
ఆడబిడ్డల నోట అలవోక భావాల ఊటసిరి!
పాటను పాడడాన్ని బహిష్కరించినప్పటి నుండి
బతుకమ్మ సహజాతం మూగబోయింది!
జారినచోటే వెతకాలని..
కాంతినై..క్రాంతినై..
మౌఖిక సాహిత్య పదసంపదల గాత్రాలను
ఎక్కడ పట్టుకోవాలా అనే చింతాక్రాంతనై
నవరాత్రుల్లో వెతుకుతున్నాను!
రండి!!
నోరారా పాడే పాట కోసం..
కొత్త అడుగులు వేద్దాం రండి!
డాక్టర్ , కొండపల్లి నీహారిణి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

