మడేలమ్మ
సూర్యుడు కాలాన్ని మోస్తున్నట్టు క్రీస్తు శిలువను భరించినట్టు వీపుల మీద బట్టల మూట చాకిరేవుకీ ఊళ్లకి రాసిచ్చిన గిశాసనం బాట
సూర్యుడు కాలాన్ని మోస్తున్నట్టు
క్రీస్తు శిలువను భరించినట్టు
వీపుల మీద బట్టల మూట
చాకిరేవుకీ ఊళ్లకి రాసిచ్చిన రాగిశాసనం బాట
వానొచ్చినా రాకపోయినా వెలుగొచ్చినా కరువొచ్చినా
చెరువు బండమీదనే బతుకింకిపాయే!
నిలబడిన నీళ్లల్ల సవికిన కాళ్లు బర్రె జెనిగల తూట్లు
ఉస్సో ఉస్సో హైలెస్సా వరుసలు
బండలపై బతుకు దర్వులు
దరువు దరువుకు పత్తిపూల తెలుపులు
ఆరేసిన బట్టల మీద సింగిడి పిట్టల ముచ్చట్లు
ఇంట్ల ఆకలి మంటలు వీధిలో ఎగతాళి సామెతల పోటులు
ఒక్కరోజు సుస్తయినా
సాకల్ది ఇంటికే రాకపాయని ఈరంగమేసే పెత్తందారులు
మిరాశీ ఇచ్చేకాడ మాత్రం నెత్తులు గోకుతరు
చెరువెండినా
చెలిమె అలిగినా కాలువ వొట్టిపోయినా
చెరువు మీద చాకిరేవాగలే
చావు వార్తలకు పెళ్లి పిలుపులకు
ఊరూరూ ఉత్తరమై తిరిగి ఎద్దుగిట్టల్లా అరిగిన కాళ్ళు
చాకిరేవు పిలుపు మేలుకొలుపు
పిల్లోడు బడికోయినట్టు
దినం తప్పకుండా ఇంటింటి మైలగుడ్డలు
మూడురాళ్ల మీద గూనెపెంకులా పొయ్యి
అరచేతిలో పులిమి పులిమి రేవు ఒడ్డున చెక్కరొచ్చే
పలక బలపం పట్టకున్నా
పిండేసిన బట్ట లెక్కలు మరువని పంతులమ్మ
సద్ది బువ్వేసినా బెల్లం గారెనేసినా ముక్కిరుసకుండా
ఊరి ఆరోగ్యమే మహాభాగ్యమని భూదేవిలా మురిసి నడిచే
చంద్రవంకలా దివిటి కోలెత్తి పెళ్లంత తానై ముందు నడిచే
అవిరేను ముందు అమ్మమ్మలా మిత్తి తీసి దీవించే
చావుకర్మలల్ల రుడం తీసి అందరికన్న ముందే నీళ్లల్ల మునిగే
ఇల్లంత సున్నమేసి ఇండ్ల సంద్య వాకలి ఊడ్సి
ఎంగిలి ఆకులు తీసి ఇంటికోతమ్మా! అన్నప్పుడు
పాత చీర చేతుల పెట్టి పాడుబుద్ధిని పోనిచ్చుకోరు
పురుట్ల నెత్తరంతెత్తి పురుడు పోసే
సముర్తయితే శుభ్రం చేసి మూలన బట్టపరిసి
ముట్టు గుడ్డలు పీతి బట్టలు కాన్పుబట్టలు చావు గుడ్డలు
ఇంటి వెట్టి ఊరువెట్టి ఈత పొరుకై ఊడ్సే
సబ్బులు సర్ఫులు డిటర్జంట్లు లేని కాలంలో
సౌడును సబ్బుగా కనిపెట్టిన శాస్త్రజ్ఞులు
సచ్చేదాక సేవలై తనువు బాణమైనా ఏ గౌరవాన్ని నోచుకోలే
చావిడికైనా దేవళానికైనా
కోట మైసమ్మ పండుగైనా పోశమ్మకు బోనాలైనా
గోడల బూజు దులిపి నిండు పున్నమై పూసే కుంచెలు
దేవుడి ముందు నైవేద్యమైనా దేవర ముందు యాటకోసినా
ఎర్రకూడు పచ్చకూడు తెల్లకూడు దిష్టితీసే పెద్దమ్మ
గండదీపానికి మట్టంటకుండా అరచేతులను కోకలుగా పరిచే
సంప్రదాయాలను మూలసుక్కలా నిలబెట్టినా తల్లి
పనంతా తనదే బరువంతా ఆమెదే ఊరి మురికంతా
తుడ్చి చాకిరంతా మోసింది
రేవు నుంచి బట్టల మూటతో వాకిట్లో చంద్రకాంతిల
ప్రతి ఇంటికి కోపం లేని ఆడబిడ్డయి సేవలు చేసే
మల్లె చెట్టు లాంటి మంచి మనిషి
సాకలమ్మ లేని ఊరు బండి యాట తాడు తెగినట్టే
తెలుపు లేని నలుపు, మామిడి తోరణం లేని పెండ్లే!
-వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

