బాలోత్సవం
నిండుగ నవ్వెడి బాలలు దండిగ తమ సొంతమైన తరుణమెఱుగుచున్ పండిత జవహరు నెహ్రూ గుండెను పూచిన గులాబి గొప్పగ మురిసెన్.
నిండుగ నవ్వెడి బాలలు
దండిగ తమ సొంతమైన తరుణమెఱుగుచున్
పండిత జవహరు నెహ్రూ
గుండెను పూచిన గులాబి గొప్పగ మురిసెన్.
మకిలి వస్త్రములైన చకితమెరుగనట్టి
పరమార్థరూప సౌభాగ్యమొగము
చెడుగుడులాడుచు చిట్టిబొజ్జకు బువ్వ
బెట్టగను మరచు దిట్టతనము
పలుకులందు తేనెలొలుకగ వాదించు
పారలౌకికతత్వ భవ్యమనము
అరమరికలు లేక సరదాగ తిరిగెడు
అనురాగ బంధాల ఆత్మగుణము
కోరుకున్న రీతి ఊరేగు భోగంబు
పూర్వజన్మ సుకృత పుణ్యఫలము
చీకుచింత లేని చిననాటి యోగంబు
మరపురాని మధుర చరిత యుగము.
కరుణ ప్రేమల యందును తరుగుబోని
ఆత్మవిశ్వాస బలమును అందజేసి
శాంతిమయ గుణ సౌశీల్య కాంతితోడ
రోగపీడితుల మదినారోగ్యపరచు.
కల్లాకపటం తెలియని
పిల్లలు ఇలువేల్పులేను ప్రియమున గనగన్
చల్లని వెన్నెల సొనలు
మల్లెల సొబగుల చిలికెడు మాహాత్మ్యసిరుల్.
– రాకుమార 95501 84758
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

