జ్ఞాపకాల లోగిలి
అదే వాన ఎప్పుడూ కురిసేదే కాకపోతే... నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి కొత్తగా తోస్తుందంతే...
అదే వాన
ఎప్పుడూ కురిసేదే
కాకపోతే…
నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి
కొత్తగా తోస్తుందంతే…
ఆ పూల చెట్టంటావా
అదెప్పుడూ అంతే…
ఎప్పుడూ విరగ పూసినట్టే గుర్తొస్తుంది
అచ్చం నీ నవ్వులానే
కానీ అప్పుడప్పుడు
వాడినట్టు కనపడుతుంది
నీవు లేవన్న నిజం గుర్తొచ్చినప్పుడే
ఈ గాలి అంతే….
నీ తలపులా హాయిగా ఉంటుంది
ఎప్పుడన్నా నువ్వు లేవని ఠక్కున గుర్తొస్తేనే
విసిరి విసిరి వీచే హోరు గాలిలా
మనసు అతలాకుతలం అయితది
నెలవంక పెరిగినట్టే నీపై ప్రేమ పెరిగి పెరిగి
నా మోము నిండు పున్నమైంది
నీ నిష్క్రమణనే నిత్య జ్ఞాపకమై
జీవితాన్ని కటిక చీకట్లోకి నెట్టింది
అయినా నా పిచ్చికానీ
నిన్ను ప్రేమించకుండా ఉంటే
ఇంత పిచ్చి ఊహ ఊగిసలాట
ఉండకపోవునేమో!
-దిలీప్.వి
84640 30808
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

