Folk songs | జనజీవన జీవిత తత్వాల సమ్మిళితమే పాట
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది. కాయకష్టాన్ని మరచిపోవడానికి పల్లెజనం పాడుకునే పదాలే పల్లెపదాలు. వీటినే జనపదాలు, జానపదాలు అంటారు.
Folk songs | జానపదాలకు మన సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉన్నది. జానపదాలలో పల్లె శ్వాస ఉంటుంది. పల్లె జనుల ఘోష ఉంటుంది. పల్లెదనపు ఇష్టం ఉంటుంది. వాళ్ల కష్టం ఉంటుంది. వారు చేసేపనీ, చేసే పద్ధతీ ఉంటుంది. పల్లె పరిమళం ఉంటుంది. పనిలోన దాగున్న శ్రమైక జీవుల జీవనం ఉంటుంది. వారి జీవితం ఉంటుంది. శ్రీశ్రీ చెప్పిన శ్రమైక జీవన సౌందర్యం ఉంటుంది.
సాహిత్యం లోని ఇతర ప్రక్రియలు, జన బాహుళ్యానికి అందవు. కానీ పాట చిన్న పెద్ద, పండితుడు, పామరుడు అనే తారతమ్యం లేకుండా, అందరినీ ఆకట్టుకుంటుంది. రంజింప చేస్తుంది. ‘రసరా జు’ లను చేస్తుంది. పాట కునుకు రాని కండ్లకు జోలపాట అవుతుంది. పగిలిన మనసుని ఓదారుస్తుంది. ఓదార్పు అవుతుంది. విరిగిన మనసుకు వేదాంత పాఠ మవుతుంది. తత్వమవుతుంది. ప్రాణ స్నేహితుడవుతుంది. పాట మనల్ని ఉత్సాహ పరుస్తుంది. ఉత్తేజ మవుతుంది. ఉత్తేజితులను చేస్తుంది. ‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది’ అని పాట స్వభావాన్ని లక్షణాన్ని చెప్తారు వేటూరి సుందర రామ్మూర్తి. పాట జీవితాలను పండుగ చేస్తుంది. పాట పరిమళాలను వెదజల్లుతుంది. పాట ప్రణయం కాగలదు. ప్రళయమూ తేగలదు. పాట గుండెల్ని పండిస్తుంది. గుండెలను పిండుతుంది కూడా. జీవతత్వమే పాట. జీవన తత్వమే పాట. జీవితతత్వమే పాట. జనజీవన జీవిత తత్వాల సమ్మిళితమే పాట.
పాట పాట కోసమే కాకూడదు. పాటకు ఓ ప్రయోజనం ఉండా లి. అవసరమైతే పాట సమాజాన్ని సంస్కరింపజేసే ఓ సాధనం కావాలి.సాధనం కాగలగాలి. ప్రయోజనం కోసం తపన పడే పాట ప్రజలతో మమేక మవుతుంది. దేశ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల స్థితిగతులను వర్తమాన పరిస్థితులను, పరిమితులను ఆకళింపు చేసుకున్నదై ఉంటుంది. సమకాలీన పరిస్థితులను స్పృశి స్తూ, సమస్యలను ఎత్తి చూపుతుంది. సమాధా నం చూపెడుతుంది. పాట చుట్టూ ఉన్న నోరులేని అమాయ క పీడితుల గొంతు అవుతుంది. సమాజానికి తోడుగ నీడగ మారి, సమ సమాజా న్ని కాంక్షిస్తుంది. అపుడు పాట మనకు చుక్కాని అవుతుంది. మరో ప్రపంచపు పొలిమేరలకు మనల్ని తీసుకెళ్తుం ది. ప్రపంచ సరిహద్దులను చెరిపేస్తుంది. అవసరమైతే అక్షరాలు ఆయుధాలు అవుతాయి. పిడిబాకులై తాడిత పీడిత జనాల బాసట నిలుస్తాయి. పిడికిలి ఎత్తి ప్రశ్నించేలా చేస్తాయి. ప్రకంపనలు సృష్టిస్తాయి. పోరాటాలకు మనల్ని సిద్ధం చేస్తాయి. సంసిద్ధులను చేస్తాయి. పోరాటం చేసేలా చేస్తాయి.
పాట మనలో పోరాట పటిమను పెంచుతుంది. పోరాటం ఉధృ తమయ్యేలా చేస్తుంది. దేశ స్వాతంత్య్ర సంగ్రామం లోను, తెలంగాణ ఉద్యమంలోను పాట కీలకమైన పాత్రను పోషించింది అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
పాట ఆశావహదృక్పథాన్ని పెంచేదిలా ఉండా లి. పాట అవగాహనను పెంచాలి. ఆలోచన ను రేకెత్తించాలి. కర్తవాన్ని గుర్తు చేయాలి. విజ్ఞత పెంచి వివేకం పంచాలి. విజ్ఞానం అందించాలి. పాటనేది విజయ తీరాల వెంట మనలను పరుగు లు తీయించాలి. అప్పుడు పాట అసలు సిసలైన పాటగా పది కాలాల పాటు నిలుస్తుంది.
– రమాప్రసాద్ ఆదిభట్ల 93480 06669
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

