శిథిల దృశ్యం
కిటికీలకు...మరోవైపు అట్టహాసంగా సాగుతున్న అన్యాయాల ఊరేగింపులు, గాలిలో కలిసిపోతున్న పసివాడి ఆర్తనాదాలు! ఎవరికీ వినబడని ఒక దీన గాథ.
కిటికీలకు…మరోవైపు
అట్టహాసంగా సాగుతున్న అన్యాయాల ఊరేగింపులు,
గాలిలో కలిసిపోతున్న
పసివాడి ఆర్తనాదాలు!
ఎవరికీ వినబడని ఒక దీన గాథ.
ఆకలి తీరని ఒడ్డున
విసిరేయబడ్డ బాల్యం,
రాలిపోవడానికి సిద్ధంగా
ఉన్న కన్నీటి బిందువు.
‘వేదన’ ధనవంతుడి
అహంకారపు నవ్వుల మధ్యన..
అలికిడి లేని నిశ్శబ్ద సమాధిగా మిగిలిపోతోంది.
ముసుగులు ధరించిన
అణచివేతలు,
రంగులు మార్చుకొని
రాజమార్గాలపై
స్వేచ్ఛగా విహరిస్తుంటే..
మనం మాత్రం మన
సుఖాల గదిలో,
‘భద్రత’ అనే గాజుతెరల
వెనుక బందీలమైపోయాం.
మన కిటికీల
రెక్కలు తెరిచే ఉన్నా..
చూపులకు దొరికేది
కేవలం ఆ నీలి ఆకాశమే!
ఆ శూన్యంలో దాగి
ఉన్న ఆర్తనాదాలు,
మన చైతన్యానికి
అందని అగోచర దృశ్యాలే.
ఇంకెంతకాలం ఇలా?
మనమెప్పుడు మేల్కొంటాం?.
-రాము కోలా ,98490 01201
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

