నీళ్ల జెండా…!
అతడు దివ్యాంగుడైనా నీళ్ల సమస్యపై విప్లవించాడు
అతడు దివ్యాంగుడైనా
నీళ్ల సమస్యపై విప్లవించాడు
కదలలేక పోయినా
నల్లగొండను కదిలించాడు
నీళ్ల గోసను ఢిల్లీకి వినిపించాడు
అతడు
జలసాధన సమితి పతాకం
ప్లోరోసిస్ నిర్మూలనకు ల్యాండ్ మార్క్
రేపటి ఉద్యమాలకు మార్గదర్శి
మనుషులు
కండ్లముందు కప్పల్లా డోకుతుంటే
పొరలు కమ్మిన వలస పాలకుల కండ్లు
పదవులనే పరమావధిగా కప్పుకున్నారు
ప్లొరోసిస్ ఎవరికీ ఎజెండా కాలే
నేలనేలంతా
దశాబ్దాలుగా కరువుతో అల్లాడింది
చారెడు నీళ్లకోసం కొంగువట్టి ఆర్థించింది
ఏ గంగమ్మ కంట్లో కన్నీరు రాల్చలే
ఏ నదికి దూపతీర్చే కనికరం లేదు
అతనికి
మానవ జన్మ శాపగ్రస్థమైనా
బాధపడలే మడత చుట్టుకొని కూసోలే
నేలకు నీళ్లు తాపే ఉద్యమమై
దుశ్చర్ల సత్యనారాయణ వెంట
నీళ్ల జెండై నడిచిండు
నల్లగొండ నీళ్లలో
అతని కన్నీటి చక్కలున్నయి
తీరొక్క పంటల్లో అతని నవ్వుంటది
అంశల స్వామి కాదు నీళ్లస్వామి
జలసాధన స్వామి!
(నల్లగొండ అంశల స్వామికి నివాళి)
వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

