సింగరేణి పాలిట రాకాసి కాంగ్రెస్!
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించింది. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అండగా నిలిచారు. కారుణ్య నియామకాలు కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే కొన్ని పార్టీల వారు ముఠాలుగా ఏర్పడి, సుమారు 17 కోర్టు కేసులు వేశారు.
తెలంగాణలో ఉమ్మడి నాలుగు జిల్లాలలో సింగరేణి గోదావరికి పరివాహక ప్రాంతంలో ఏర్పడి ఉంటుంది. సింగరేణి ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 49శాతంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 58 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఏండ్లు, తెలుగుదేశం పార్టీ 17న ఏండ్లు పాలించాయి. కానీ సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు. సింగరేణి కార్మికుల కష్టాలను మానవీయ కోణంలో చూస్తేనే అర్థమవుతాయి. కీలకమైన సంస్థలో కార్మికుల పట్ల, వారికి అవసరమైన చట్టాలు, హక్కుల పట్ల పాలకులు విఫలమయ్యారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల గోస తీర్చింది. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కష్టాలు తిరిగి మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించింది. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అండగా నిలిచారు. కారుణ్య నియామకాలు కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే కొన్ని పార్టీల వారు ముఠాలుగా ఏర్పడి, సుమారు 17 కోర్టు కేసులు వేశారు. కేసీఆర్ న్యాయ నిపుణులను సంప్రదించి స్వతంత్ర సంస్థ అయిన సింగరేణిలో కారుణ్య నియామకాలకు మార్గం సుగమం చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో 20 వేల కారుణ్య వరకు నియామకాలు చేపట్టారు. అలాగే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సింగరేణి కార్మికుల కుటుంబాలకు చెందిన 4,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. సింగరేణిని లాభాల బాట పట్టించడంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు, కార్మికులకు లాభాల్లో వాటా విషయంలో సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయి. కేవలం 12 శాతం లాభాల పాట పంపిణీ చేశాయి. కేసీఆర్ సర్కార్ మాత్రం 20 శాతానికి పెంచింది. ఆ మొత్తాన్ని 2023 వరకు 32 శాతానికి తీసుకెళ్లింది.
సింగరేణి కంపెనీ లాభాలు రూ.6,323 కోట్లు వస్తే రూ.2,360 కోట్లుగా చూపించి మిగతా ప్రాఫిట్‌ను సింగరేణి అభివృద్ధి పేరిట ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో అసలే కుంభకోణాల్లో కూరుకుపోయిన సింగరేణిలో ఉత్పత్తి తగ్గింది. లాభాలు రాలేని దుస్థితి నెలకొన్నది. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ పాలకులు పొగబెడుతున్నారు. బంధుమిత్రులకు టెండర్లు అప్పగిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డికి చెందిన సోదా కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నదని తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో సమయంలో ఓపెన్ టెండర్ల విధానం నిర్వహించారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపాలపల్లిలో ఒక్క ఓబీ టెండర్‌కు పిలిచి, ఇప్పుడు ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకొస్తున్నారు? సింగరేణి కార్మికుల సంఖ్య 40,000 లో 20 వేల కార్మికులు బీఆర్ఎస్ హయాంలో కారుణ్య నియామకాలతో విధుల్లో చేరినవారే. గతంలో సింగరేణి కార్మికుల పిల్లలకు మాత్రమే మెడికల్ ఇన్వాల్యుయేషన్ ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా పూర్తిస్థాయి నాణ్యమైన వైద్య సాయం అందించారు. ఇప్పుడు సింగరేణి కార్మికులు పెద్ద దవాఖానలకు పోతే వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు.
సింగరేణి కార్మికుల నుంచి తీసుకునే ప్రొఫెషనల్ టాక్స్‌ను కేసీఆర్ హయాంలో రద్దు చేశారు. అలాగే ఆదాయపన్నును కూడా రద్దు చేసే దిశగా అసెంబ్లీలో తీన్మానం చేసి, పార్లమెంటుకు పంపించారు. ఈ విషయాన్ని కార్మిక లోకం గుర్తుంచుకోవాలి. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, అవినీతి టెండర్ల ప్రక్రియ గురించి ఎందుకు సీరియస్‌గా స్పందించడంలేదు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలి. అదేవిధంగా కార్మికుల చెమటోడ్చి సింగరేణికి ఆర్జించి పెట్టిన నిధుల నుంచి రూ.100 కోట్లను మెస్సితో ఫుట్‌బాల్ ఆడడానికి దుబారా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. సింగరేణిలో అడుగడుగునా కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటూ సీఎం అంటే ప్రజల చీఫ్ మినిస్టర్‌గా కాకుండా కోల్ మాఫియా అవతారం ఎత్తారు. మరోవైపు ప్రైవేటీకరణకు కూడా కాంగ్రెస్ పాలకులు మంతనాలు నడుస్తున్నాయని చర్చ జరుగుతున్నది. ఇందుకు పెద్దల సమక్షంలోనే డైరెక్షన్స్ అందుతున్నాయని తెలుస్తున్నది. అలాంటి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు రద్దు చేసుకోకపోతే ఎన్నో పోరాటాల చరిత్ర గలిగిన సింగరేణి కార్మికులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతారు. బొగ్గు కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పతనం ఖాయమని కార్మిక లోకం హెచ్చరిస్తున్నది.
రాము యాదవ్ సూర
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

