పర్యావరణ దీపం!
నాకు బతుకమ్మ పెత్తరమాసతో కాదు, బొడ్డెమ్మతోనే మొదలవుతుంది! బతుకమ్మకు మొదటి అడుగు బొడ్డెమ్మ!
నాకు బతుకమ్మ పెత్తరమాసతో కాదు, బొడ్డెమ్మతోనే మొదలవుతుంది!
బతుకమ్మకు మొదటి అడుగు బొడ్డెమ్మ!
బొడ్డెమ్మను అనుసరించిన తర్వాతి అడుగు బతుకమ్మ!
పుట్టమన్నుతో చేసిన పీట బొడ్డెమ్మ
బావి మట్టితో కూర్చిన బావి బొడ్డెమ్మ
సీతాఫలం ఆకులతో పేర్చిన పందిరి బొడ్డెమ్మ
మనిషి తొక్కని మట్టితో చేసిన గుంటబొడ్డెమ్మ
పూల పండుగలో నా మట్టి ముచ్చట్లు ఇవి!
బొడ్డెమ్మ పైన పెట్టిన వెంపలి చెట్టు
గౌరమ్మకు పెట్టిన కుంకుమ బొట్టు
ముత్తైదులకు పంచిన వాయనం మూట
నవరాత్రుల్లో కట్టిన గొల్లభామ లంగా
మట్టి పండుగలో నా చెరువు సంగతులు ఇవి!
సబ్బండ వర్ణాలకు పంచిన మలీద ముద్దలు
చేపలకు వేసిన సద్దుల ఆహారం
పక్షులకు చల్లిన అటుకుల ఫలహారం
ఎడ్ల పండుగలో మెరిసిన జీవకారుణ్యం
చెరువుల పండుగలో నా పాటల చప్పట్లు ఇవి!
రంగురంగుల అడవి పూలను
చుట్టుకున్న చెల్కల బంగారం
ఊరేగే పూలతోటలా ఊళ్లసింగారం
తూగాడే పూలఏరులా చెరువుల పరవశం
ఆత్మీయతతో పంచుకునే సద్దుల ఆహారం
పాటల పండుగలో నా నాట్య విలాసం ఇది!
బతుకమ్మంటే ఆశ్రమ ధర్మాలను
గుర్తు చేసే జీవన సారం!
శ్రమ జన్మలను గుర్తు పట్టే వికాస పాఠం
ఆడబిడ్డల చేతుల్లో ఒదిగిన ప్రకృతి రూపం!
పల్లెగుండెల్లో నిలిచిన పర్యావరణ దీపం!
అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రాతో మొదలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

