గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం అయ్యాకా, పసిపిల్లలకు పాలిస్తున్నప్పుడూ శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. ఆకృతిలోనూ ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే బిడ్డపుట్టిన తర్వాత చాలా మంది వార్డ్రోబ్ మార్చేస్తుంటారు. అమ్మల కోసం ప్రత్యేకించిన కొన్ని రకాల వదులైన దుస్తుల్ని ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు సెలెబ్రిటీలు మాత్రం కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారు. ప్రత్యేకించిన మెటర్నిటీ వేర్ బదులుగా కొత్త ఫ్యాషన్ దుస్తుల్లోనే అనువైనవి ఎంచుకుంటున్నారు.
ఫ్యాషన్‌ను ఈ సమయంలో మాత్రం ఎందుకు వదులుకోవాలి? అన్న భావనతో ైస్టెల్ చేసుకుంటున్నారు. ఓవర్ సైజ్డ్ చొక్కాలు, వదులుగా ఉండే ప్యాంట్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నవే. అదే తరహాలో నడుము కింద నుంచి కుచ్చులు వచ్చే మ్యాక్సీ డ్రెస్ తరహావీ, లూజ్‌గా ఉండే క్రాప్‌టాప్‌లు, ఫ్లేర్డ్ డ్రెస్‌లు ఇందుకోసం ఎంచుకుంటున్నారు. సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణెలాంటి బాలీవుడ్ యాక్టర్లతో పాటు హాలీవుడ్ నటీమణులూ, సెలెబ్రిటీలూ ఇప్పుడు ఈ సూత్రాన్నే పాటిస్తున్నారు. పొట్ట ఉండటం, ఆకృతిలో మార్పులు రావడం అంటే ఫ్యాషన్‌గా లేనట్టు అన్న భావనను చెరిపేస్తున్నారు.