Health Tips | మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Health Tips | ఆరోగ్యం బాగుండాలంటే పోషకాహారం తీసుకోవాలి! ఈ మాట నిజమే కానీ, మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కారణం, వారి జీవితంలోని ప్రతిదశలోనూ అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటారు.
Health Tips | ఆరోగ్యం బాగుండాలంటే పోషకాహారం తీసుకోవాలి! ఈ మాట నిజమే కానీ, మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కారణం, వారి జీవితంలోని ప్రతిదశలోనూ అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటారు. రజస్వల అయినప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవానంతరం, మెనోపాజ్ దశలోనూ హార్మోన్ల తీరువల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వీటికి తోడు కెరీర్‌లాంటి అదనపు ఒత్తిళ్లు సరేసరి. మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డితోపాటు మరిన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- మహిళల్లో ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల మోకాలి నొప్పుల నుంచి రొమ్ము క్యాన్సర్ వరకూ ఎన్నో ప్రమాదాలు పలకరిస్తాయి. అందుకని డైట్లో కొవ్వు పదార్థాలు తగ్గించి తాజా పండ్లు, కాయగూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- శనగల్లో మహిళల ప్రత్యేక ఆరోగ్య అవసరాలకు సాయపడే ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలు ఉంటాయి. వీటిలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి, ఆకలి నియంత్రణలో ఉంటుంది. పీచు పదార్థమూ అధికమే. కాబట్టి శనగలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
- వాల్‌నట్స్‌లో అరుదైన ఒమేగా 3,6 పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌లాంటి సమస్యలను నివారించడమే కాకుండా నిద్రలేమి లాంటి ఇబ్బందులనూ దూరం చేస్తాయి.
- జీవక్రియలు సజావుగా సాగడానికి, మెరుగైన రోగ నిరోధక శక్తి కోసం ప్రోబయాటిక్స్ అవసరం అవుతాయి. వీటివల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఇందుకోసం ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, పాలు రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకోవాలి.
- ఆకుకూరలు, చేపలు, బాదంపప్పు, టమాటాలు.. ఇలా యాంటి ఇన్ఫ్లమేటరీ (వాపును తగ్గించేవి) ఆహారాన్ని తీసుకోవడం వల్ల బహిష్టు సమయంలో వచ్చే కండరాల నొప్పులు తగ్గుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

