అనవసర ఖర్చు కాదు.. మీ హక్కు
సొంత సంపాదన ఉన్నా.. మహిళలు తమకోసం డబ్బు ఖర్చు పెట్టుకోలేక పోతున్నారట. పైగా, తమ అవసరాల కోసం ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా గిల్టీగా ఫీలవుతున్నారట. దీని వెనుక చాలా లోతైన మానసిక, సామాజిక కారణాలు ఉన్నాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
సొంత సంపాదన ఉన్నా.. మహిళలు తమకోసం డబ్బు ఖర్చు పెట్టుకోలేక పోతున్నారట. పైగా, తమ అవసరాల కోసం ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా గిల్టీగా ఫీలవుతున్నారట. దీని వెనుక చాలా లోతైన మానసిక, సామాజిక కారణాలు ఉన్నాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. మనదేశంలో ఆడపిల్లల పెంపకంలో కుటుంబంతోపాటు సమాజం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కుటుంబం, పిల్లలు, భర్త అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వారికి బాల్యం నుంచే నేర్పిస్తుంటారు. ఈ క్రమంలో తమకోసం ఖర్చు చేసుకోవడం అనేది.. ‘అనవసరమైన ఖర్చు’ అనే భావన ఆడవాళ్లలో బలంగా నాటుకుపోతుంది.
‘ఖర్చు చేయడానికి నేను అర్హురాలినేనా?’ అనే అంతర్మథనం కూడా ఉంటుంది. ఎందుకంటే, కుటుంబం కోసం అన్నీ త్యాగం చేసే మహిళలు.. తమ విలువను తాము ఇతరులకు చేసే సేవలతోనే ముడిపెట్టుకుంటారు. ఫలితంగా, కేవలం తమ సంతోషం కోసమే ఖర్చు చేయడాన్ని వాళ్లు స్వార్థంగా భావిస్తుంటారట. అంతేకాకుండా, డబ్బు అనేది భద్రతకు ప్రతీక. కాబట్టి, తమకోసం ఖర్చు చేసుకుంటే, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో అనే భయం ఓవైపు, కుటుంబ సభ్యుల అవసరాలను పక్కనపెట్టి తాము వాడుకుంటున్నామనే అపరాధ భావన మరోవైపు వారిని వేధిస్తుంది. దాంతో, ఆడవాళ్లు ఖర్చులకు వెనకాడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఎలా బయటపడాలి?
- ప్రతినెలా బడ్జెట్ వేసుకునేటప్పుడు, ప్రత్యేకంగా మీకోసమే కొంత మొత్తాన్ని కేటాయించుకోండి. దానిని ఏ ఇతర అవసరాలకూ వాడకుండా, పూర్తిగామీ సంతోషం కోసమే ఖర్చు చేసుకోండి.
- మీ సంపాదనతోనే మీకు నచ్చిన వస్తువులను కొంటున్నారన్న విషయం మనసులో పెట్టుకోండి. అప్పుడు ‘ఈ ఖర్చుకు నేను పూర్తిగా అర్హురాలిని’ అనే ఆలోచన తప్పకుండా మీ మనసులోకి వస్తుంది.
- డబ్బుతోపాటు మీ సంతోషం, మీ మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమేనని గ్రహించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అంటే స్వార్థం కాదు, అది మీ బాధ్యత అని గుర్తుంచుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

