శ్రీవారితో సరదాగా
ఉద్యోగ బాధ్యతల్లో నిత్యం బిజీగా ఉండే శ్రీవారిని సరదాగా నవ్వించండి. ఆట పట్టించండి. రోజువారీ వర్క్ మూడ్ నుంచి బయటికి తీసుకురండి. దీనివల్ల ఇద్దరి మధ్యా బంధం, అనుబంధం మరింత బలపడుతుంది. ఇదిగో.. ఈ చిట్కాలు మీకోసమే..
ఉద్యోగ బాధ్యతల్లో నిత్యం బిజీగా ఉండే శ్రీవారిని సరదాగా నవ్వించండి. ఆట పట్టించండి. రోజువారీ వర్క్ మూడ్ నుంచి బయటికి తీసుకురండి. దీనివల్ల ఇద్దరి మధ్యా బంధం, అనుబంధం మరింత బలపడుతుంది. ఇదిగో.. ఈ చిట్కాలు మీకోసమే..
ప్రేమ స్టిక్కర్లు..
మీవారి వార్డ్రోబ్ మీద ‘ఐ లవ్యూ హబ్బీ’ అని ఓ స్టిక్కీ నోట్ అంటించండి. స్నానం చేసి డ్రెస్ కోసం వార్డ్రోబ్ తెరిచినప్పుడు మీరెంతగా ప్రేమిస్తున్నారో చూసి మురిసిపోతాడు. ఇంట్లో మీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఫ్రేమ్‌లుగా, పెయింటింగ్‌గా చేయించి డెకరేట్ చేయండి.
చెవిలో చెప్పండి..
ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా చూస్తున్నప్పుడో.. వెబ్ సిరీస్ ఆస్వాదిస్తున్నప్పుడో ఆ రొమాంటిక్ సీన్‌కు తగ్గట్టు మీ మనసులోని మాట గుసగుసగా పంచుకోండి.
సెల్ఫీ పంపండి..
ఆయన నిత్యం ఆఫీస్ పనిలోనో, బిజినెస్ హడావుడిలోనో ఉంటారు పాపం. ఆ సమయంలో మూడ్ మార్చేందుకు.. అందమైన చిరునవ్వుతో మీ సెల్ఫీ పంపండి. పిల్లల ఫొటోలు పంపండి. పని తాలూకు టెన్షన్ తొలగిపోయి.. వెంటనే కళ్లలో ప్రశాంతత నిండిపోతుంది.
స్పర్శతో మ్యాజిక్..
బయటికి కనిపించరు కానీ.. మగవారు కూడా సున్నిత మనస్కులే. అర్ధాంగి వెచ్చని స్పర్శ అతనికెంతో సాంత్వననిస్తుంది. మ్యూజిక్ వింటున్నప్పుడో, కబుర్లు చెప్పుకొంటున్నప్పుడో తలపై చెయ్యిపెట్టి సుకుమారంగా దువ్వండి. చేతిలో చెయ్యి వేయండి.
నీ ముద్దే చాలు పూబంతీ..
అవును.. ముద్దుకి చాలా శక్తి ఉంది. గుక్కపట్టి ఏడ్చే చంటిబిడ్డను ఎత్తుకొని ఒక ముద్దు పెడితే క్షణాల్లో ఏడుపు మాయం. అంత శక్తిమంతమైనది అమ్మ ముద్దు. మళ్లీ అంత పవర్ఫుల్ భార్య ముద్దు. మీకోసం నిత్యం కష్టపడే శ్రీవారికి ఇష్టంగా ఒక ముద్దు పెట్టండి. అదీ అడక్కుండానే. అడగక ఇచ్చిన.. పాట గుర్తుందిగా!
పొగడండి..
ఫలానా టైమ్‌లో మీరు చేసిన పని నాకు చాలా నచ్చింది. మీరు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత ముద్దొస్తారో అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఎంతవారలైనా.. పొగడ్తలకు దాసులే?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

