ఏమంటారో అని గుబులు!
పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అన్ని విషయాల్లో బాగానే ఉన్నా ఒక మారుల విషయంలో మాత్రం భయపడుతూ ఉంటారు. బాగా చదివే పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఈ విషయంలో ఆందోళన చెందుతారు. పరీక్ష ముగిశాక ఇంటికి రాగానే ఆన్సర్ షీట్‌ను ఎవరికీ కనపడకుండా బ్యాగ్ అడుగున దాచేస్తాడో పిల్లాడు. తల్లిదండ్రులు పరీక్షల గురించి అడగ్గానే వెంటనే టాపిక్ మార్చేస్తుంది మరో అమ్మాయి. ఇంకొందరు రిపోర్ట్ కార్డును స్వయంగా ఇచ్చే ధైర్యం లేక దాచిపెడుతుంటారు.
పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అన్ని విషయాల్లో బాగానే ఉన్నా ఒక మారుల విషయంలో మాత్రం భయపడుతూ ఉంటారు. బాగా చదివే పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఈ విషయంలో ఆందోళన చెందుతారు. పరీక్ష ముగిశాక ఇంటికి రాగానే ఆన్సర్ షీట్‌ను ఎవరికీ కనపడకుండా బ్యాగ్ అడుగున దాచేస్తాడో పిల్లాడు. తల్లిదండ్రులు పరీక్షల గురించి అడగ్గానే వెంటనే టాపిక్ మార్చేస్తుంది మరో అమ్మాయి. ఇంకొందరు రిపోర్ట్ కార్డును స్వయంగా ఇచ్చే ధైర్యం లేక దాచిపెడుతుంటారు.
ఈ ప్రవర్తన వెనుక కేవలం మారులు తకువ వచ్చాయి అనే సిగ్గు మాత్రమే ఉండదు. కాగితంపై పడిన మార్కుల కన్నా.. వాటని చూసిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో అనే తీవ్రమైన భయమే పిల్లలను ఇలా ప్రవర్తించేలా చేస్తుంది. ఇటీవల ఓ పరిశోధన పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర ప్రోగ్రెస్ కార్డు దాచి ఉంచడానికి గల కారణాల్ని వివరించింది. తల్లిదండ్రులతో ఉండే అనుబంధమే పిల్లలు వైఫల్యాల్ని ఎలా ఎదురొంటారో నిర్ణయిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 100కి 48 మారులు వచ్చిన ఒక పిల్లాడికి, తను సరిగ్గా రాయలేదనే బాధ ముందే ఉంటుంది. అయితే దానికి తోడు ఇంట్లో ఎదురయ్యే ప్రశ్నల్ని చూసి భయపడిపోతుంటాడు.
‘నీ ఫ్రెండ్‌కి నీ కన్నా ఎకువ మారులు వచ్చాయి, ఓ సారి చూడు. నీకు సరిగ్గా చదువు అబ్బడం లేదు. ఇలాగైతే రేపు ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాస్తావో!’ లాంటి ఘర్షణ వాతావరణాన్ని తాతాలికంగానైనా తప్పించుకోవడానికే పిల్లలు మారుల పత్రాన్ని దాచిపెడతారు. ఆస్ట్రేలియాలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న 839 మంది విద్యార్థులపై చేసిన ఈ అధ్యయనంలో ఇలాంటి కీలక విషయాలెన్నో వెల్లడయ్యాయి. ఇంట్లో తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ప్రతికూల వాతావరణం ఎదురొనే పిల్లలు సమస్యల నుంచి పారిపోవడానికి అలవాటు పడతారు. అదే ఇంట్లో సానుకూల ప్రోత్సాహం లభించే పిల్లలు, సమస్యను ఎదురొని పరిషరించుకోవడానికి ప్రయత్నిస్తారు.
మారులు అనేవి ఒక పాఠ్యాంశం ఎంతవరకు అర్థమైందో కొలిచే సాధనాలు మాత్రమే. కానీ పదే పదే ర్యాంకులు, శాతాలు, ఇతరులతో పోలికల గురించే మాట్లాడినప్పుడు మారులే తమ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని పిల్లలు భావిస్తారు. మంచి మారులు వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో ప్రేమ, గుర్తింపు దకుతాయని భావించే పిల్లల్లో పరీక్షల భయం చాలా ఎకువగా ఉంటున్నది. పదేపదే మార్కులంటూ పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయకుండా తల్లిదండ్రులు తమ ప్రవర్తనను పిల్లల ఇష్టాలకు తగ్గట్టుగా మార్చుకోవడం అవసరం. ఓ మిత్రుడిలా తోడుంటూ వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించడం ఉత్తమం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

