బయటికి వెళ్లేటప్పుడు పర్స్ మర్చిపోకుండా ఇంట్లోవాళ్లు గుర్తు చేసేవాళ్లు. ఇప్పుడైతా ఫోన్ కూడా గుర్తు చేస్తున్నారు. కొంతమంది డెబిట్, క్రెడిట్ కార్డులు పర్స్‌లో ఉన్నాయా? లేవా? చూసుకుని బయలెల్లుతారు. మారుతున్న ఈ అవసరాలకు తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగులు, పర్సులు మారుతున్నాయి. క్రెడిట్ కార్డులు భద్రంగా ఉంచుకునేలా, సెల్‌ఫోన్‌ని పెట్టుకుని, కాల్ వచ్చినప్పుడు వాడుకునేలా కొత్త అరలు, సరికొత్త ఫీచర్లతో బ్యాగ్‌లు వస్తున్నాయి.
ఈ వేసవిలో బయటికి వెళ్లినప్పుడు బ్యాగుతోపాటు వాటర్ బాటిల్ కూడా తీసుకుపోవాలి. చిన్నపిల్లలను సాయంత్రాల్లో పార్క్‌కి తీసుకుపోవాల్సి వచ్చినప్పుడు, ఖాళీ సమయాల్లో షాపింగ్‌కి వెళ్లేటప్పుడు బ్యాగ్ తీసుకునిపోవచ్చు. ఇలాంటప్పుడు మరో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకోవడం కష్టంగానే ఉంటుంది.
అంతేకాదు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు కూడా మెట్రోల్లో, బస్సుల్లో బ్యాగు, బాటిల్‌ని బ్యాలెన్స్ చేయడం కష్టమే. ఇలా ఇబ్బంది పడకుండా ఉండేందుకు బ్యాగులు అవసరానికి తగ్గట్టుగా కొత్త రూపాల్లోకి మారిపోతున్నాయి. క్రెడిట్‌కార్డులు, చిన్న చిన్న వస్తువులు, సెల్‌ఫోన్ పెట్టుకునేందుకు చిన్న చిన్న అరలు ఉన్నట్టే వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు పెద్ద అరతో చక్కని రూపంలో వస్తున్నాయి. ఇదీ ఆ తరహా వాటర్ బ్యాగే! ఇందులో మనకు అవసరమయ్యే అన్ని వస్తువులతోపాటు వాటర్ బాటిల్‌ను కూడా పెట్టుకోవచ్చు. సింగిల్ హ్యాండ్‌తో అన్నీ మోసేయొచ్చు. మెట్రో నగరాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యాగులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.