Counselling | ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? కెనడా సంబంధానికి ఓకే చెప్పాలా? ఎవర్ని ఎంచుకోవాలి?
నేను మధ్యతరగతి అమ్మాయిని. అరవై ఏండ్లు వచ్చేవరకు నాన్న అంతంతమాత్రం జీతానికి ప్రైవేటు ఉద్యోగం చేశారు. పింఛను రాదు. అమ్మ గృహిణి. నేను కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది.
నేను మధ్యతరగతి అమ్మాయిని. అరవై ఏండ్లు వచ్చేవరకు నాన్న అంతంతమాత్రం జీతానికి ప్రైవేటు ఉద్యోగం చేశారు. పింఛను రాదు. అమ్మ గృహిణి. నేను కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది. నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను తెలివైనవాడు. టాప్ ర్యాంకర్. తన ఉన్నత చదువులకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నాను. ఈ మధ్యే ఓ పెండ్లి సంబంధం వచ్చింది. వరుడు కెనడాలో ఉంటాడు. లక్షల్లో జీతం. సంపన్న కుటుంబం. మాకు అండగా నిలబడతానని చెబుతున్నాడు. అతణ్ని కనుక చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అమ్మానాన్న సర్దిచెబుతున్నారు. నేను ఎటూ నిర్ణయించుకోలేక పోతున్నా. ప్రేమించినవాడా, కుటుంబాన్ని ఆదుకునేవాడా? ఎవర్ని ఎంచుకోవాలి?
- ఓ పాఠకురాలు
ఇక్కడ ఆలోచించడానికి ఏమీ లేదు. మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకవైపు బాల్య స్నేహితుడు, పేదవాడు, ఎంతోకాలంగా మీరు ప్రేమిస్తున్నవాడు. మరోవైపు.. ఓ సంపన్న ప్రవాసుడు, బొత్తిగా అపరిచితుడు, ఆర్థికంగా ఆసరా ఇచ్చేవాడు. ప్రేమించిన వ్యక్తిని పెండ్లాడాలంటే.. మరికొంతకాలం ఆగాలి, అతను అన్నివిధాలా స్థిరపడాలి. పెద్దలు కుదిర్చిన పెండ్లి అయితే.. ఆర్థిక భద్రతకు భరోసా ఉంటుంది. అబ్బాయి గుణగణాలకు సంబంధించి మాత్రం స్పష్టత ఉండదు. భాగ్యలక్ష్మి లాటరీలాంటి వ్యవహారం. రెండువైపులా ఎంతోకొంత రిస్క్ ఉంది. ఉంటుంది కూడా. ఇది మీ జీవితం. మీ ఎంపికే అంతిమం. మీరేం టీనేజ్ అమ్మాయి కాదు. చదువుకున్నారు. ఉద్యోగం చేస్తున్నారు. తగిన నిర్ణయం తీసుకోగల మానసిక శక్తి, తెలివితేటలు మీకున్నాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

