బయోటిన్.. ఈ పోషకం గురించి పెద్దగా విని ఉండం. కానీ, రాబోయే రోజుల్లో ఇది ట్రెండ్ కాబోతున్నది. బి విటమిన్లో భాగమైన బయోటిన్ గురించి రోజురోజుకూ సరికొత్త విషయాలు తెలియడమే ఇందుకు కారణం.
ఏమిటీ బయోటిన్: మన శరీరంలో జీవక్రియలు సరిగా ఉండాలంటే అందుకు తగిన కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అందాలి. ఈ బాధ్యతను తీసుకునేదే బయోటిన్.
ఉపయోగం: బయోటిన్ చేసే సాయం వల్ల మన జుట్టు, చర్మం, మెదడు సామర్థ్యం, గుండె పనితీరు మెరుగ్గా ఉంటాయి. షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
తగ్గితే!: పోషకాహారం తీసుకోనివారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడేవారిలో బయోటిన్ లోటు రావచ్చు. దద్దుర్లు, నరాల బలహీనత వంటి లక్షణాలు తలెత్తవచ్చు.
సమృద్ధిగా లభించేందుకు: ఆకుకూరలు, గుడ్లు, బాదం లాంటి పప్పులు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.